పుష్ప 2 సినిమాలో శ్రీలీల కిస్సిక్‌ అనే ఐటమ్‌ సాంగ్‌లో ఆడి పాడింది. ఈ ఒక్క పాటతో శ్రీలీలకు బోల్డంత పేరు వచ్చింది.

పుష్ప 2 సినిమాలో శ్రీలీల కిస్సిక్‌ అనే ఐటమ్‌ సాంగ్‌లో ఆడి పాడింది. ఈ ఒక్క పాటతో శ్రీలీలకు బోల్డంత పేరు వచ్చింది. హీరోయిన్‌కు వచ్చినంత క్రేజ్‌ వచ్చింది. శ్రీలీలకు ఇదే మొదటి ఐటమ్‌ సాంగ్‌.. ఇదే చివరి సాంగ్‌ కూడా! కిస్సిక్‌ పాట(Kissik song)తర్వాత ఇక జీవితంలో తాను ఐటమ్‌ సాంగ్‌ చేయనని ఆమె చెప్పేసింది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కోసం కూడా శ్రీలీలను ఓ ఐటమ్‌ సాంగ్‌ కోసం అడిగారు. ఆ ఆఫర్‌ను కూడా శ్రీలీల సున్నితంగా తిరస్కరించినట్టు ఫిల్మ్‌నగర్‌ చెప్పుకుంటోంది. పుష్ప సినిమాలో సమంత(Samantha) ఐటమ్‌సాంగ్‌ చేసింది కాబట్టి, పుష్ప 2లో తాను సాంగ్‌ చేస్తే తప్పేమీ ఉండదని భావించే శ్రీలీల ఇందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఇలాంటి ఆఫర్లు ఎన్ని వస్తున్నా.. ఎంత పారితోషికాన్ని ఆఫర్‌ చేస్తున్నా శ్రీలీల మాత్రం కేర్‌ చేయడం లేదని అంటున్నారు. చేస్తే హీరోయిన్‌గానే చేస్తా.. లేకపోతే ఖాళీగా ఉంటాననీ, అంతేకానీ ఐటమ్‌ సాంగ్స్‌ మాత్రం చేయనని శ్రీలీల గట్టిగానే చెప్పేశారట! నితిన్‌ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన రాబిన్‌హుడ్‌ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కూడా ఓ సినిమాలో శ్రీలీల నటిస్తున్నది.

ehatv

ehatv

Next Story