బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda srinivas) వరుసపెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు కానీ ప్రేక్షకుల మనసు గెల్చుకోలేకపోతున్నారు. తెలుగులో కాకపోతే హిందీలోనైనా హిట్‌ కొట్టి సత్తా చాటుకుందామనుకున్న శ్రీనివాస్‌ ఛత్రపతి(chatrapathi) రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. అక్కడా నిరాశే ఎదురయ్యింది. ఎన్నో వాయిదాల తర్వాత నెల రోజుల కిందట ఆ సినిమా విడుదలయ్యింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda srinivas) వరుసపెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు కానీ ప్రేక్షకుల మనసు గెల్చుకోలేకపోతున్నారు. తెలుగులో కాకపోతే హిందీలోనైనా హిట్‌ కొట్టి సత్తా చాటుకుందామనుకున్న శ్రీనివాస్‌ ఛత్రపతి(chatrapathi) రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. అక్కడా నిరాశే ఎదురయ్యింది. ఎన్నో వాయిదాల తర్వాత నెల రోజుల కిందట ఆ సినిమా విడుదలయ్యింది. మొదటి రోజే నెగటివ్‌ టాక్ తెచ్చుకుంది. సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. మూడేళ్ల పాటు ఒళ్లు హూనం చేసుకుని, రాత్రింబవళ్లు ఈ సినిమా కోసమే శ్రీనివాస్‌ కష్టపడ్డారు. కానీ కష్టానికి ఫలితం దక్కలేదు. బాలీవుడ్‌లో కుదరని పని అని గ్రహించిన ఆయన మళ్లీ టాలీవుడ్‌లోకి వచ్చేశారు. సాగర్‌ కే చంద్ర(Sagar k Chandra) దర్శకత్వలో ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు.

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌(power star) భీమ్లానాయక్(Bhimla nayak) తర్వాత సాగర్ కే చంద్ర చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ పోలీసు వేషంలో కనిపించబోతున్నారు. ఇంతకు ముందు కవచం(Kavacham), రాక్షసుడు(Rakshakudu) సినిమాలలో శ్రీనివాస్‌ ఖాకీ చొక్కాను వేసుకున్నారు.
కవచం ఫ్లాప్‌ అయ్యింది. బెల్లంకొండ కెరీర్‌లో కాసింత పేరు తెచ్చని సినిమా ఏదైనా ఉంటే అది రాక్షసుడే! ఇక ఇప్పుడు మూడో సారి పోలీస్ కథతో వస్తున్నాడు. అయితే ఇది సీరియస్ పోలీస్ పాత్ర కాదట. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే పోలీసు పాత్ర అట. బెల్లంకొండకు పోలీసు క్యారెక్టర్ బాగా సెట్‌ అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. హీరోయిన్‌ ఎవరనేది ఇంకా డిసైడ్‌ కాలేదు. మొదట శ్రీలీలను అనుకున్నా, డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఆమె ఒప్పుకోలేదు.

Updated On 14 Jun 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story