పెళ్లి సందD సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీలీల(Sreeleela) మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డ్యాన్సులలో ఆమెను మించిన వారు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కాదు. కొందరు హీరోలు కూడా ఆమె ముందు బలాదూరే! రవితేజ(Ravi Teja) సినిమా ధమాకాలో ఆమె వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు.
పెళ్లి సందD సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీలీల(Sreeleela) మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డ్యాన్సులలో ఆమెను మించిన వారు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కాదు. కొందరు హీరోలు కూడా ఆమె ముందు బలాదూరే! రవితేజ(Ravi Teja) సినిమా ధమాకాలో ఆమె వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో రవితేజ, శ్రీలీల కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్స్ ఎంతో పాపులరయ్యాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల లేటెస్ట్ సినిమా స్కంద(Skanda). ఇది సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్నది. ఇందులో రామ్(Ram Pothineni) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో శ్రీలీల బిజీగా ఉన్నారు. ఇందులో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను చిన్నప్పటి అమ్మ ఒత్తిడి వల్లే భరత నాట్యం నేర్చుకున్నానని అన్నారు. అలా చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్ కూడా తనకు ఒక భాగం అయిపోయిందని చెప్పారు. అలా తన స్కూల్లో కూడా ఏదైనా ప్రొగ్రామ్ ఉంటే మొదట తన డ్యాన్స్ ఉండేదని, అలా ఒక్కోసారి డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కాళ్లకు బొబ్బలు కూడా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. అప్పుడు డ్యాన్స్ అపేస్తానని అమ్మతో చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. డ్యాన్స్ నేర్చుకోమనే ప్రోత్సహించారని, ఆ తర్వాత తనకే డ్యాన్స్ మీద మక్కువ పెరిగిందని శ్రీలీల అన్నారు. శ్రీలీల అమ్మ స్వర్ణలత బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్టు. 'అమ్మ డాక్టర్ కావడంతో నాకు స్కూలులో సెలవులు వస్తే నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్స్‌లకు తీసుకెళుతూ ఉండేది. ఈ కారణం వల్ల నాకు కూడా మెడిసిన్ చేయాలనే ఆసక్తి ఏర్పడింది. నా ప్రతి బర్త్‌డే రోజున ఫోటో షూట్ చేయించడం అమ్మకు ఇష్టం. అలా ఒకసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భువన గౌడతో ఫోటో షూట్‌ను అమ్మ చేయించింది. ఫోటోలను ఆయన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వాటిని చూసిన కన్నడ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చాడు. అలా స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి రావడం జరిగిపోయింది.' అని శ్రీలీల తెలిపారు. ఆ తర్వాత తనకు డాక్టర్ కావలనే కోరిక చిన్నతనం నుంచే ఉండటంతో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదన్నారు. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల చాల బాధపడ్డానని శ్రీలీల తెలిపారు. తనకు ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం ఏ మాత్రం నచ్చదని, షూటింగ్‌లో ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే సమయంతో పాటు నిర్మాతకు కూడా ఖర్చు పెరుగుతుందని, ఇది ఏ మాత్రం అంత మంచిది కాదని అన్నారు. అలా ఓ సారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ముప్పై టేకులు తీసుకున్నానని, ఆ పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్ చేసినా కూడా ఓకే కాలేదని, అలా ముప్పై సార్లు రీటేక్స్ తీసుకోవడం చాలా బాధగా అనిపించిందని చెప్పారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ మూడు పేజీల లేఖను శేఖర్ మాస్టర్‌కు రాసిందట. అందుకు ఆయన కూడా తనకు ఫోన్ చేసి ఇందులో నీ తప్పేంలేదు.. ఈ పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారు బ్యాక్ గ్రౌండ్‌లో కరెక్ట్ స్టెప్‌లు వేయడం లేదని చెప్పారట. కేజీఎఫ్ ఫేమ్ యశ్‌తో శ్రీలీల కుటుంబానికి పరిచయం ఉంది. యశ్ భార్య రాధికకు రెండుసార్లు శ్రీలీల అమ్మగారే డెలివరీ చేశారు. రాధిక డెలివరి సమయంలో ఎక్కువగా ఆస్పత్రిలో శ్రీలీలే ఉండేవారు. అలా రాధికను అక్కా అని శ్రీలీల పిలుస్తారు. అంతేకాకుండా యశ్‌ను జీజూ అంటే బావ అని పిలుస్తుంటారు.