యంగ్ హిరోయిన్ శ్రీలీలకు(srileela) వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దాదాపు పది సినిమాల్లో నటిస్తున్నారామె! ఆమె నటించిన మొదటి సినిమా పెళ్లి సందడి(pelli Sandhadi). ఇందులో గ్లామర్‌గా కనిపించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది.
యంగ్ హిరోయిన్ శ్రీలీలకు(sreeleela) వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దాదాపు పది సినిమాల్లో నటిస్తున్నారామె! ఆమె నటించిన మొదటి సినిమా పెళ్లి సందడి(pelli Sandhadi). ఇందులో గ్లామర్‌గా కనిపించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చి ధమాకా(dhamaka) సినిమా ఆమెను స్టార్‌ను చేసింది. ధమాకా సూపర్‌హిట్ కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా శ్రీలీలపై పడింది. స్టార్ హీరోల సరనన నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే తలంపుతో శ్రీలీల ఉంది. గ్లామర్‌గా కనిపించే విషయంలో తన ఆలోచన మార్చుకుంది. అందాన్ని హద్దుల్లో చూపించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది.
అలా అయితేనే ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎక్కువ కాలం ఉండవచ్చని తెలుసుకుంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఇలాంటి షరతులనే విధిస్తున్నారట. 'నేను అలా కనిపించలేను. నాకు కంఫర్టబుల్‌గా ఉండదు' అని తెగేసి చెబుతున్నారట. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌లోనే నటించాలని శ్రీలీల డిసైడయ్యింది. గ్లామర్ రోల్స్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించడానికే ఇష్టపడతాను అని గతంలో శ్రీలీల చాలాసార్లు చెప్పింది. పాపం ఆమెను తెరపై గ్లామర్‌గా చూపించలనుకునే దర్శకులు డీలా పడ్డారు. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, పంజా వైష్ణవ్ తేజ్, నితిన్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది.