ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో క్రేజీ హీరోయిన్ ఎవరయ్యా అంటే అందరూ టక్కున శ్రీలీల(Sreeleela) పేరే చెబుతారు. వరుస సినిమాలతో ఆమె చాలా బిజీగా ఉన్నారు. టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. ఆమె ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదట! ఎవరితోనూ డేటింగ్‌లో లేరట!
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో క్రేజీ హీరోయిన్ ఎవరయ్యా అంటే అందరూ టక్కున శ్రీలీల(Sreeleela) పేరే చెబుతారు. వరుస సినిమాలతో ఆమె చాలా బిజీగా ఉన్నారు. టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. ఆమె ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదట! ఎవరితోనూ డేటింగ్‌లో లేరట! నిజమే సినిమాలలో తీరిక లేకుండా ఉంటే ప్రేమించడానికి టైమ్ ఎక్కడ దొరుకుతుంది. అదలా ఉంచితే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ లిస్ట్ చెప్పారు శ్రీలీల.. తనను మనువాడేవాడిలో ఎట్‌లీస్ట్ మూడు క్వాలిటీలైతే మస్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. అలాంటి క్వాలిటీలు ఉన్నవాడితోనే మూడుముళ్లు వేయించుకుంటానని అంటున్నారు. ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయికి చాలా గట్స్ ఉండాలట! రెండో క్వాలిటీ ఏమిటంటే ఆమెకు కాబోయే భర్తకు మంచి హాస్య చతురత ఉండాలట! ఇక మూడోదేమిటంటే ఆయనగారు కాస్త ఫ్యామిలీ టైపులో అందంగా, పద్దతిగా ఉండాలట! ఈ మూడు క్వాలిటీలున్నవాడినే పెళ్లి చేసుకుంటానని శ్రీలీల చెబుతున్నారు. అంచేత శ్రీలీలను మూగగా ప్రేమిస్తున్న అబ్బాయిలు.. మీలో ఈ మూడు క్వాలిటీలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి! ఆల్ ది బెస్ట్!