పెళ్లిసందD(PellisandhaD) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీలీల(Sreeleela) తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్‌ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. లాస్టియర్‌ ధమాకా(Dhamaka) సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న శ్రీలీల ఈ ఏడాది భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari), స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాచ్‌ సినిమాలతో అలరించింది

పెళ్లిసందD(PellisandhaD) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీలీల(Sreeleela) తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్‌ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. లాస్టియర్‌ ధమాకా(Dhamaka) సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న శ్రీలీల ఈ ఏడాది భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari), స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాచ్‌ సినిమాలతో అలరించింది. వచ్చే ఏడాది ఆరంభంలో గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు విజయవంతమైతే శ్రీలీలకు ఇక తిరుగు ఉండదు. సినిమాలపై శ్రీలీలకు ఎంత ఆసక్తి ఉన్నదో, చదువుపై కూడా ఆమెకు అంతే శ్రద్ధాసక్తులు ఉన్నాయి. డాక్టర్‌(Doctor) కుటుంబం నుంచి వచ్చిన శ్రీలీలకు డాక్టర్‌ అవ్వాలనుకుంది. పట్టుదలతో చదివింది. ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మెడిసిన్‌ను కంప్లీట్‌ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ లాస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ రాస్తోంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఎగ్జామ్స్‌ ఉన్నాయి. అది కూడా ముంబాయిలో. అందుకే సినిమాలకు షార్ట్ బ్రేక్‌ ఇచ్చింది. ముంబాయిలో పరీక్షలు రాస్తోంది. ఇందులో పాసైతే ఆమె డాక్టర్‌ అవుతుంది. ఎంబీబీఎస్‌ పట్టా చేతికి అందగానే తన తల్లితో కలిసి బెంగళూరులో(Bangalore) ఓ హాస్పిటల్‌ (Hospital)ప్రారంభించే ఆలోచనలో ఉంది శ్రీలీల. అయితే ఎండీ కోర్సు చేయాలా? లేక సినిమాలు కొనసాగిస్తూ హాస్పిటల్‌ బాధ్యతలను చూసుకోవాలా? అన్నది ఇంకా డిసైడ్‌ చేసుకోలేదట! ఒకవేళ డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చేయాలనుకుంటే మాత్రం సినిమాలు చేయడం కుదరదు. మరి శ్రీలీల ఏం చేస్తుందో చూడాలి.

Updated On 20 Dec 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story