నటి శ్రీలీలకు(sreeleela) అదృష్టం బాగా కలిసివస్తోంది. లేకపోతే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌కు చేరడం అంటే మాటలు కాదుగా! ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె పేరే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తోంది. యూత్‌కు ఇప్పుడామె అభిమాన కథానాయిక. ఇప్పుడామె చేతిలో ఎంత కాదన్నా పది సినిమాలున్నాయి. సాధారణంగా ఓ హీరోయిన్‌ చేతిలో మహా అయితే మూడు సినిమాలుంటాయంతే. అలాంటిది శ్రీలీల చేతిలో పది సినిమాలున్నాయంటే ఆమె అదృష్టం మామూలుగా లేదు. ఈ స్థాయికి ఆమె చేరుకోవడానికి చాలా అంశాలు కలిసివచ్చాయి. అమెరికాలో(america) పుట్టి బెంగళూరులో(Bangalore)పెరిగిన శ్రీలీల కుటుంబ నేపథ్యం తెలుగు కావడం బాగా కలిసి వచ్చింది

నటి శ్రీలీలకు(sreeleela) అదృష్టం బాగా కలిసివస్తోంది. లేకపోతే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌కు చేరడం అంటే మాటలు కాదుగా! ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె పేరే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తోంది. యూత్‌కు ఇప్పుడామె అభిమాన కథానాయిక. ఇప్పుడామె చేతిలో ఎంత కాదన్నా పది సినిమాలున్నాయి. సాధారణంగా ఓ హీరోయిన్‌ చేతిలో మహా అయితే మూడు సినిమాలుంటాయంతే. అలాంటిది శ్రీలీల చేతిలో పది సినిమాలున్నాయంటే ఆమె అదృష్టం మామూలుగా లేదు. ఈ స్థాయికి ఆమె చేరుకోవడానికి చాలా అంశాలు కలిసివచ్చాయి. అమెరికాలో(america) పుట్టి బెంగళూరులో(Bangalore)పెరిగిన శ్రీలీల కుటుంబ నేపథ్యం తెలుగు కావడం బాగా కలిసి వచ్చింది.

టాలీవుడ్‌లోకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు కానీ వీరిలో తెలుగులో మాట్లాడేది, డబ్బింగ్‌ చెప్పేది చాలా తక్కువమందే. వీళ్లతో పోల్చుకుంటే శ్రీలీల తెలుగును చాలా స్పష్టంగా పలుకుతుంది. సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. తల్లి స్వర్ణలతది తెలుగు కుటుంబం కావడంతో ఇంట్లో చిన్నప్పటి నుంచే తెలుగులోనే మాట్లాడుకునేవారు. అలా శ్రీలీలకు తెలుగు భాషపై పట్టు పెరిగింది. మరో విషయమేమింటే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్స్‌ కొరత చాలా ఉంది. పూజా హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం, రష్మిక(rashmika) తెలుగు కంటే పాన్‌ ఇండియా సినిమాలకే ప్రాధాన్యతనిస్తుండటం, కృతిషెట్టిపై(Kriti shetty) ఫ్లాప్‌ సినిమాల ముద్ర పడటం శ్రీలీలకు అనుకూలంగా మారాయి. ఇంకొందరు హీరోయిన్లు ఉన్నారు కానీ వారికి స్టార్‌ హీరోలతో నటించేంత రేంజ్‌ లేదు. తెలుగు హీరోయిన్లలో మాస్‌ డ్యాన్స్‌ చేసేవాళ్లు తక్కువగానే ఉన్నారు. తమన్నా(Tamannaah) చేసేవారు కానీ ఇప్పుడామె తెలుగులో పెద్దగా నటించడం లేదు.

ఈ డాన్స్‌లో శ్రీలీల ఎక్స్‌పర్ట్‌ కాబట్టి దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. తెలుగులో తొలి సినిమా 'పెళ్లి సందD'లో(Pellisandha'D') క్యూట్ స్టెప్పులేసిన శ్రీలీల ధమాకాలో రెచ్చిపోయి డాన్స్‌లు చేసింది. దుమ్ము రేపింది. ఇది కూడా శ్రీలీలకు బాగా ప్లస్ అయింది. తెలుగులో ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ఉన్నప్పటికీ వారంతా థర్టీ ప్లస్‌లో ఉన్నారు. కొందరి వయసు 30లోపు ఉన్నా వారు స్టార్‌ హరోల రేంజ్‌ను మ్యాచ్‌ చేయలేరు. శ్రీలీల మాత్రం స్టార్‌ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేసేస్తోంది. శ్రీలీల వయసు 22 ఏళ్లు మాత్రమే.. ఇప్పుడామె ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి కావడానికి ఎంత కాదన్నా మూడేళ్లు పడుతుంది. అప్పటికీ ఆమె వయసు పాతికేళ్లే ఉంటుంది. ఇది కూడా శ్రీలీలకు బాగా కలిసివచ్చింది. ఈమె గ్లామర్‌ విషయంలో ఎలాంటి కండీషన్లు పెట్టడం లేదు. అందుకే డైరెక్టర్లు ఈమెను ప్రిఫర్‌ చేస్తున్నారు. మొత్తంగా శ్రీలీల అదృష్టమే అదృష్టం...

Updated On 28 Jun 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story