అందం, అభినయం ఉంటే సరిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోగలరు. ఈ లెక్కన శ్రీ లీల అదృష్టవంతురాలే! మొదటి సినిమా పెళ్లిసందడి అంతగా విజయవంతం కాకపోయినప్పటికీ శ్రీలీల మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

అందం, అభినయం ఉంటే సరిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోగలరు. ఈ లెక్కన శ్రీ లీల అదృష్టవంతురాలే! మొదటి సినిమా పెళ్లిసందడి అంతగా విజయవంతం కాకపోయినప్పటికీ శ్రీలీల మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ధమాకా సినిమా సూపర్‌హిట్‌ కావడంతో శ్రీలీలను(sreeleela) అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడామె టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌. వరుస సినిమాలతో శ్రీలీల దూసుకుపోతున్నది. యువ హీరోలతో పాటు అగ్రహీరోల సరసన కూడా నటిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడామె స్టార్‌ హీరోయిన్‌. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకుంది. వరుసగా అగ్రహీరోల సినిమాల్లో చేయడం వల్ల ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పడుతుందనే భయం ఎప్పుడైనా వేసిందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రీలీల అర్థవంతమైన జవాబు చెప్పింది. 'సీనియర్లతో చేస్తే ఒకలాగా, యంగ్‌ హీరోలతో చేస్తే మరోలాగా ఇమేజ్‌ ఏర్పడదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి.

ప్రేక్షకులు ఇప్పుడు ఆ విధంగా ఆలోచించడం లేదు. చాలా మారిపోయారు. ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. ఓ కథను సినిమాగా మలుస్తున్నప్పుడు అందులోని పాత్రలకు ఎవరు సూటవుతారా అని ఆలోచిస్తారు. అందుకు తగిన పాత్రలకు సరిపోయే నటీనటులనే ఎంపిక చేస్తారు. మనకు ఇచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నామా లేదా అన్నదే ప్రేక్షకులు చూస్తారు. అంతే తప్ప మీ పక్కన ఉన్నది అగ్ర హీరోనా, కుర్ర హీరోనా అనేది ఎవరూ చూడదు. ఏ కళాకారుడికి కూడా ఇలాంటి ఆలోచన ఉండకూడదు. అసలు వయసును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవొద్దు' అని శ్రీలీల చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మాయి తెలుగులో మహేశ్‌బాబు(Mahesh Babu) సరసన గుంటూరు కారంలో(Gunturu Karam), పవన్‌ కల్యాణ్‌(Pawam Kalyan) సరసన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో(Ustad Bhagath Singh), ఆదికేశవ చిత్రాలతో పాటు నితిన్‌(Nithin), రామ్‌(RAM), విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda) చిత్రాలలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated On 3 Jun 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story