టాలీవుడ్(Tollywood) లో వరుస అవకాశాలుసాధిస్తోంది పెళ్ళిసందడి భామ శ్రీలీల(Sreeleela ). సీనియర్ స్టార్ల పక్కన కూడా మెరుస్తోంది. రీసెంట్ గా రవితేజ(Ravi Teja) పక్కన అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పుడు పవర్ స్టార పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) జోడీగా నటించబోతోంది.

టాలీవుడ్(Tollywood) లో వరుస అవకాశాలుసాధిస్తోంది పెళ్ళిసందడి భామ శ్రీలీల(Sreeleela ). సీనియర్ స్టార్ల పక్కన కూడా మెరుస్తోంది. రీసెంట్ గా రవితేజ(Ravi Teja) పక్కన అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పుడు పవర్ స్టార పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) జోడీగా నటించబోతోంది.

టాలీవుడ్ ఫుల్ బిజీగా మారింది. యంగ్ హీరోయిన్ శ్రీలీల. యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ పక్కన కూడా అదే ఎనర్జీతో సందడి చేస్తోంది. పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ(Tollywood Entry) ఇచ్చిన శ్రీలీల.. రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ సరసన 'ధమాకా' సినిమాతో పెద్ద హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదాని లిస్ట్ లో.. నితిన్(Nithin) .. రామ్(Ram) .. వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లాంటి హీరోలు ఉన్నారు. అంతే కాదు ప్రస్తుతం బాలయ్య(Balayya) బాబు కూతురిగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాలో నటిస్తోంది శ్రీలీల. అవ్వడానికి బాలయ్య కూతురే అయినా.. సినిమాలో ఆమె పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక శ్రీలీల ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడీగా గోల్డెన్ ఛాన్స్(Golden Chance) కొట్టేసింది శ్రీలీల. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ పక్కన హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారట మేకర్స్. ఇక ఉస్తాబ్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) షూటింగ్ ను ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే శ్రీలీల మాత్రం 10వ తేదీ నుంచి షూటింగ్ లో పాల్గోనబోతున్నట్టు తెలుస్తోంది.

తనకంటే 30 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న హీరోలతో కూడా నటిస్తోంది శ్రీలీల ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, సీనియర్ స్టార్ హీరోల జోడీగా కుదిరిపోయే ఫిజిక్ ఆమె సొంతం. అందుకుతోడు క్రేజ్ కి తగిన సక్సెస్ లు దక్కడం మరో విశేషం. అవే ఆమెను పవన్ సినిమా వరకూ తీసుకుని వెళ్లాయి. ఇక ఈ సినిమాలో మరో నాయికగా మాళవిక మోహనన్(Malavika Mohanan) కనిపించనుంది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Updated On 31 March 2023 11:33 PM GMT
Ehatv

Ehatv

Next Story