మొన్నీమధ్యనే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం టీజర్ రిలీజయ్యింది. సమంత లీడ్ రోల్ పోషించిన ఆ సినిమా టీజర్ అనుకున్నట్టుగానే యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఈ సందర్భంగా ఓ చిన్న ముచ్చట. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా వివిధ భాషలలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆ వివరాలు మరోసారి చెప్పుకుందాం కానీ.. కళాత్మక చిత్రాల దర్శకుడు వి.శాంతారాం 1943లో శకుంతల సినిమా తీశారు.. ఇందులో దుష్యంతుడి పాత్రను అప్పటి హిందీ […]
మొన్నీమధ్యనే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం టీజర్ రిలీజయ్యింది. సమంత లీడ్ రోల్ పోషించిన ఆ సినిమా టీజర్ అనుకున్నట్టుగానే యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఈ సందర్భంగా ఓ చిన్న ముచ్చట. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా వివిధ భాషలలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆ వివరాలు మరోసారి చెప్పుకుందాం కానీ.. కళాత్మక చిత్రాల దర్శకుడు వి.శాంతారాం 1943లో శకుంతల సినిమా తీశారు.. ఇందులో దుష్యంతుడి పాత్రను అప్పటి హిందీ నటుడు చంద్రమోహన్ వేశారు. శకుంతలగా జయశ్రీ నటించారు. జయశ్రీ ఎవరో కాదు శాంతారాం సతీమణే! ఈ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. ఎందుకోగానీ శాంతారాంకు కథపై మోజు తగ్గలేదు. మళ్లీ వెండితెరకు ఎక్కించాలన్న కోరిక బలంగా పడింది.. అందుకే 1961లో స్త్రీ పేరుతో మళ్లీ శకుంతల ఇతివృత్తాన్ని తెరకెక్కించారు శాంతారాం. దుష్యంతుడి పాత్ర కోసం నందమూరి తారక రామారావును సంప్రదించారు. ఆ టైమ్‌లో తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. పైగా మద్రాస్ వదిలి వెళ్లడానికి మనస్కరించలేదు. శాంతారాం అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని గౌరవం. అందుకే హిందీ సినిమాలో నటించడం కుదరదని చాలా సున్నితంగా చెప్పారు. దాంతో దుష్యంతుడి పాత్రను తానే పోషించారు శాంతారాం. ఇందులో శకుంతలగా సంధ్య నటించారు. సంధ్య శాంతారాం రెండో భార్య. ఈ సినిమాలో జయశ్రీ కూతురు రాజశ్రీ కూడా నటించారు. ఈ సినిమా కూడా విజయవంతమైంది..ఇది జరిగిన అయిదేళ్లకు రాజ్యం పిక్చర్స్ వారు ఎన్టీఆర్‌తో శకుంతల తీశారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శకుంతల పాత్రను బి.సరోజాదేవి పోషించారు.