✕
సరిగ్గా 70 ఏళ్ల కిందట, ఇదే రోజున విజయావారి చంద్రహారం(Chnadraharam) సినిమా విడుదలయ్యింది. అగ్ర తారలతో, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర తన్నేసింది. నాగిరెడ్డి(Nagi reddy)-చక్రపాణి(chakrapani) ఊహలకు కూడా అందని పరాజయాన్ని మిగిల్చిన 70 ఏళ్ల నాటి ఆ చంద్రహారం విశేషాలను తెలుసుకుందాం! విజయా సంస్థ నుంచి వచ్చిన నాలుగో సినిమా చంద్రహారం. వాస్తవానికి పాతాళభైరవి(Pathalabhairavi) తర్వాత విజయా(Vijaya Production) వారు అనుకున్నది చంద్రహారం ప్రాజెక్టునే! కాకపోతే సరైన ప్లాన్ లేకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఏడాది తర్వాత మళ్లీ మొదలయ్యింది. అలా నెమ్మదిగా సాగుతూ చివరకు మూడేళ్ల తర్వాత పూర్తయ్యింది.

x
70 Years For Chandraharam Movie
-
- సరిగ్గా 70 ఏళ్ల కిందట, ఇదే రోజున విజయావారి చంద్రహారం(Chnadraharam) సినిమా విడుదలయ్యింది. అగ్ర తారలతో, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర తన్నేసింది. నాగిరెడ్డి(Nagi reddy)-చక్రపాణి(chakrapani) ఊహలకు కూడా అందని పరాజయాన్ని మిగిల్చిన 70 ఏళ్ల నాటి ఆ చంద్రహారం విశేషాలను తెలుసుకుందాం! విజయా సంస్థ నుంచి వచ్చిన నాలుగో సినిమా చంద్రహారం. వాస్తవానికి పాతాళభైరవి(Pathalabhairavi) తర్వాత విజయా(Vijaya Production) వారు అనుకున్నది చంద్రహారం ప్రాజెక్టునే! కాకపోతే సరైన ప్లాన్ లేకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఏడాది తర్వాత మళ్లీ మొదలయ్యింది. అలా నెమ్మదిగా సాగుతూ చివరకు మూడేళ్ల తర్వాత పూర్తయ్యింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ ప్రభావం కథ మీద, కథనం మీద అమితంగా పడింది. విజయవారికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏ పాతాళభైరవి సినిమా అయితే విజయా సంస్థను సమున్నత స్థానంలో నిలబెట్టిందో, అదే పాతాళభైరవి ఈ సినిమా విషయంలో ప్రతికూలశక్తిగామారింది. ప్రేక్షకులు ఆ సినిమాతో చంద్రహారాన్ని పోల్చుకున్నారు. అక్కడే సినిమా దెబ్బతిన్నది. పాతాళభైరవి సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు విజయా సంస్థకు అపారమైన సంపదను ఆర్జించి పెట్టింది. ఆ ఉత్సాహంతోనే రెండు సినిమాలు మొదలు పెట్టారు విజయాధినేతలు. మొదటిది చంద్రహారం. పౌరాణిక ఛాయలు ఉన్న జానపద చిత్రం ఇది! దిగ్దర్శకుడు కె.వి.రెడ్డికి(KV Reddy) అసోసియేట్గాఉన్న కమలాకర కామేశ్వరరావుకు(Kamlakar Kameswara Rao) దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. పింగళి నాగేంద్రరావు(Pingali Nagendra Rao) కథ, సంభాషణలు, పాటలు అందించారు. నాగిరెడ్డి సోదరుడు కొండారెడ్డిని(Kondareddy) కెమెరామన్‌గా పెట్టుకున్నారు. రెండో సినిమా పెళ్లి చేసి చూడు(Pelli chesi chudu) అనే సాంఘిక చిత్రం. దీనికి ఎల్వీ ప్రసాద్‌ను(LV Prasad) దర్శకుడిగా ఎంచుకున్నారు. సినిమాకు చక్రపాణి రచనను అందించారు. విజయాసంస్థలో ఘంటసాలకు అప్పట్లో అయిదు సినిమాలకు కాంట్రాక్టు ఉండటంతో ఈ రెండు సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలో కూడా తీయాలనుకన్నారు విజయావారు. ఒక చిత్రంతో రెండో సినిమా క్లాష్ రాకుండా ఉండేందుకు పక్కాగా షెడ్యూళ్లను ప్లాన్ చేశారు. చంద్రహారం సినిమా బౌండెడ్ స్క్రిప్టు 1950 జులై నాటికే సిద్ధమయ్యింది.
-
- సంక్షిప్తంగా ఇదీ కథ! చందన రాజ్యాన్ని పలించే చంద్రచూడునికి(Chandrachudu) మగ సంతానం లేకపోవడంతో అల్లుడు ధూమకేతుకు రాజ్యాధికారం అప్పగించాలని అనుకుంటాడు. ఇంతలో చంద్రచూడునికి రాజగురువు ఓ దివ్య ఫలాన్ని అందిస్తాడు. చంద్రుడి అనుగ్రహంతో మహారాణికి కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదిస్తాడు. కొన్నాళ్లకు రాణి పండంటి మగశిశువుకు జన్మనిస్తుంది. చంద్రుడి అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి అతడికి చందనుడు(Chandanudu) అని పేరు పెడతారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన మాలి దగ్గర విద్యాబుద్ధులు నేర్పిస్తాడు చంద్రచూడుడు. చందనుడికి చంద్రహారాన్ని ఇచ్చిన రాజగురువు, రాజకుమారుడికి యుక్తవయసులో దేవకన్యల వల్ల ప్రాణగండం ఉందని చెబుతాడు. పెళ్లి చేస్తే గండం నుంచి బయటపడవచ్చని అంటాడు. అప్పటికే చేతికి వచ్చిన అధికారం చేజారిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ధూమకేతుకు నిక్షేపరాయుడు తోడవుతాడు. ఇద్దరూ కలిసి చందనుడికి పెళ్లి కాకుండా అడ్డుపడుతుంటాడు. చందనుడి మనసులో ఓ ఊహా సుందరి ఉంటుంది. ఆమె చిత్రాన్ని గీసి ఆమె కోసం వెతుకుతుంటాడు. ఆ ఊహా సుందరి పేరు గౌరి. సిరిపురంఅనే గ్రామంలో తన సవతితల్లి మరిడమ్మ చేతిలో అష్టకష్టాలు పడుతూ ఉంటుంది. మరిడమ్మకు ఓ కూతురు ఉంటుంది. ఆమె పరమభక్తురాలు, అణకువగల అమ్మాయి. ఆమెను మరిడమ్మ మేనల్లుడు బుజ్జాయి ప్రేమిస్తుంటాడు. కానీ మరిడమ్మ మాత్రం కూతురుకు పెద్ద సంబంధం చేయాలనుకుంటుంది. చంచల అనే దేవకన్య చందనుడిని వలచి తన కోరిక తీర్చమని అడుగుతుంది. అందుకు చందనుడు ఒప్పుకోడు. దాంతో చందనుడిపై చంచల పగబడుతుంది. అతడి మెడలో ఉన్న చంద్రహారాన్ని మాయతో హరిస్తుంది. అతడిని నిర్జీవుడుని చేస్తుంది. కానీ, ఆమె సోదరి అచల మాత్రం చాలా మంచిది. చందనుడిని, గౌరిని కలుపుతుంది. ఇది చంచలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో మరిన్ని దుర్మార్గాలకు ఒడిగడుతుంది. గౌరి తన భక్తితో వాటిని ఎలా ఎదుర్కొగలిగిందన్నదే మిగతా కథ!
-
- ఎన్టీఆర్(NTR) హీరో, శ్రీరంజని(Sri Ranjani) హీరోయిన్! యువరాజు చందన్ పాత్రను సహజంగానే ఎన్.టి.రామారావుకుఇచ్చారు. కథానాయిక గౌరి వేషానికి జూనియర్ శ్రీరంజనిని తీసుకున్నారు. 1949లో వచ్చిన గుణసుందరి కథతో శ్రీరంజని చాలా ఫేమస్ అయ్యారు. ఇంటింటా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. గుణసుందరి కథలో ఆమెకు జంటగా కస్తూరి శివరావు నటించారు. ఓ పెద్ద హీరోతో శ్రీరంజనికి అవకాశం ఇవ్వాలని చాన్నాళ్లుగా చక్రపాణి అనుకుంటూ వచ్చారు. ఈ సినిమాతో చక్రపాణి కోరిక తీరింది. పాతాళభైరవి సినిమాలో మాయమహల్ వినోద ప్రదర్శనలో నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి డాన్స్ చేసిన సావిత్రిని(Savitri) ఎల్.వి.ప్రసాద్ సిఫార్సుతో రెండు సినిమాల్లోనూ తీసుకున్నారు.పెళ్లి చేసి చూడు సినిమాలో సావిత్రి రెండో హీరోయిన్. జోగారావు సరసన నటించారు. చంద్రహారం సినిమాలో మాత్రం పూర్తి వ్యాంప్ పాత్ర. మల్లీశ్వరిలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి అందరిని ఆకట్టుకున్న శ్రీవత్సను చంద్రచూడ రాజుగా, ఆయన భార్యగా వెంకుమాంబను, ధూమకేతుగా రేలంగిని, అతడి భార్య ఆశాదేవిగా సూర్యాకాంతంను, నిక్షేపరాయునిగా జోగారావును, కింకరులుగా పద్మనాభం, కె.వి.ఎస్.శర్మను(KVS Sharma), గౌరి తండ్రిగా దొరస్వామిని, సవతి తల్లిగా రుష్యేంద్రమణిని(Rushyendrami), మారుటి చెల్లి చిన్నిగా పుష్పలతను(Pushpa Latha), ఆమె మేనమామగా పంతులును, అతడి వెర్రిబాగుల కొడుకు బుజ్జాయిగా బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారు. కథలో కీలకమైన మాలి వేషానికి ఎస్.వి.రంగారావును, చంచలను సన్మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించే ఆమె అక్క అచలగా కాంతాదేవిని తీసుకున్నారు. బాల చందన రాజుగా వేసింది బేబీ దువ్వూరి అన్నపూర్ణ. 1950 ఆగస్టు 5వ తేదీన ముఖ్యమైన ఆర్టిస్టులందరికీ మేకప్ టెస్ట్‌లు నిర్వహించారు. అందరూ చక్కగా నప్పారు అన్న భరోసా వచ్చిన తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన షూటింగ్ మొదలు పెట్టారు. సెప్టెంబర్ 12వ తేదీన పాటల రికార్డింగ్ జరిగింది. అప్పటికే పెళ్లి చేసి చూడు సినిమా మొదటి షెడ్యూల్ మొదలయ్యింది. రెండు సినిమాలలోనూ ఎన్టీఆరే హీరో కాబట్టి ఆయన పనికి ఇబ్బంది కలుగకుండా శ్రీరంజనిపై గ్రామం దృశ్యాలతో షూటింగ్ మొదలుపెట్టారు. సిరిపురం దృశ్యాలు, చందన నగర దర్బారు సన్నివేశాలు చిత్రీకరించారు. అప్పటికే 61 కాల్షీట్ల పని జరిగింది. శీనయ్య, మరిడమ్మ, బుజ్జాయి, చిన్ని మొదలైన పాత్రల సన్నివేశాలు పూర్తయ్యాయి. ఇక చందన నగరం దృశ్యాల చిత్రీకరణను మొదలుపెట్టాలి.
-
- తీసిన దృశ్యాలు చూసి గుండెలు బాదుకున్నారు! అప్పటికే తీసిన దృశ్యాలు చూశారు. గుండెలు గుభేలుమన్నాయి. కారణం అవే దృశ్యాలు సగం సినిమా నిడివిని ఆక్రమించేట్టుగా ఉండటం! ఇలాగే తీస్తూపోతే సినిమా నిడివి అయిదు గంటలకు పైగా వచ్చేట్టు ఉందని గ్రహించారు. అంటే స్క్రిప్టులో లోపాలు బాగా ఉన్నాయని తెలుసుకున్నారు. వెంటనే స్క్రిప్టును సంస్కరించాలని నిర్ణయించేశారు. దాంతో 1951 జూన్‌లో షూటింగ్ ఆపేశారు. స్క్రిప్టును(Script) సరిదిద్దే పనిలో పడ్డారు. మరోవైపు పెళ్లిచేసిచూడు సినిమా షూటింగ్ మాత్రం అనుకున్నట్టుగా సజావుగా సాగిపోతున్నది. రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదని ముందు పెళ్లిచేసిచూడు సినిమాను పూర్తి చేశారు. 1952, ఫిబ్రవరి 29వ తేదీన పెళ్లిచేసిచూడు సినిమా విడుదలయ్యింది. ఘన విజయం సాధించింది. తెలుగు వెర్షన్ విడుదలైన మూడు నెలల తర్వాత తమిళ వెర్షన్ కల్యాణం పణ్ణిపార్ రిలీజయ్యింది. ఇది కూడా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. దీంతో విజయా సంస్థ బాధ్యత మరింత పెరిగింది. తదుపరి సినిమా సరిగ్గా ఆడకపోతే బ్యానర్‌కు అప్రతిష్ట. అందుకే చంద్రహారం స్క్రిప్టును చాలా జాగ్రత్తగా సంస్కరించాలని అనుకున్నారు. ఎలాంటి మార్పులు చేశారో, ఎలాంటి దిద్దుబాట్లు చేశారో వారికి తెలియాలి. మొత్తం మీద స్క్రిప్ట్‌ను సరిదిద్దడాన్ని కానిచ్చేసి 1952 ఏప్రిల్ 6వ తేదీన మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. రెండోసారి షూటింగ్ మొదలయ్యే సమయానికి కెమెరామన్ కొండారెడ్డి వేరే సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమాకు పని చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే కల్యాణం పణ్ణిపార్ సినిమా కూడా విడుదల కావడంతో మార్కస్ బార్ట్లే ఖాళీ అయ్యారు. వెంటనే ఆయనను చంద్రహారం చిత్రానికి తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావుకు ఇదే మొదటి సినిమా. స్క్రిప్ట్‌లు జరిగిన మార్పులు చేర్పుల వల్ల కమలాకర కంగారు పడతారేమోనని ఎల్.వి.ప్రసాద్‌ను పర్యవేక్షకునిగా నియమించారు. ఇంతమంది అతిరథమహారథులు సినిమా కోసం పని చేస్తున్నా ఎక్కడో ఏదో లోపం జరుగుతోందన్న అనుమానం అందరినీ వేధిస్తూనే ఉండింది. కాకపోతే అది ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టేది కాదు. మరిడమ్మ, బుజ్జాయి, చిన్ని పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను రీ షూట్ చేశారు.
-
- ప్రతి దృశ్యంలోనూ భారీతనం కనిపించింది ఇక్కడ్నుంచి అసలు కథ మొదలయ్యింది. చంద్రహారం సినిమాలో ప్రతి సన్నివేశం రిచ్‌గా(Rich) కనిపిస్తుంది. ఏ సన్నివేశాన్ని చూసినా సరే, ఇది భారీ చిత్రం అని ఈజీగా అర్థమవుతుంది. తెరమీద కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కనిపించే సెట్ల(Set) నిర్మాణానికి యూనిట్ మూడేసి వారాలు శ్రమించాల్సి వచ్చేది. కొన్ని సెట్లకు లైటింగ్ అమర్చడానికే మార్కస్ బార్ట్లేకు రెండు కాల్షీట్ల టైమ్ తీసుకునేది. 1948లో వచ్చిన జెమినీ వారి చంద్రలేఖ సినిమాను అత్యంత భారీ ఎత్తున తీశారు. భారీ చిత్రాల నిర్మాణంలో దక్షిణాత్యులు ఉత్తరాదివారికి ఏమాత్రం తీసిపోరని నిరూపించిన సినిమా ఇది! జెమినీ వాసన్ ప్రభావం నాగిరెడ్డి-చక్రపాణిలపై చాలా ఉండేది. అందుకే తాము కూడా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఆ సంకల్పమే చంద్రహారం సినిమాకు ఉసికొల్పింది. ప్రేక్షకుడికి మూడు నాలుగు సినిమాలు కలిపితే వచ్చే సంతృప్తిని ఈ ఒక్క చిత్రంతోనే ఇచ్చేయాలని అనుకున్నారు. అందుకే భారీగా ఖర్చు పెట్టారు. 1953 డిసెంబర్లో చంద్రహారం షూటింగ్ పూర్తయ్యింది. చివరి సన్నివేశంలో దేవేంద్రుడి దర్బారులో వచ్చే చంచల నాట్యం చివరిగా చిత్రీకరించారు. అప్పటికే షూటింగ్ అయిన భాగా నెగిటివ్ కట్టింగ్ పూర్తయిపోయింది. డబ్బింగ్, రీరికార్డింగ్ పూర్తి చేసి అయినంతవరకు రీళ్లను ప్రింట్లు కూడా తీశారు. నిర్మాణం మొదలైన మూడేళ్ల తర్వాత చంద్రహారం షూటింగ్ పూర్తయ్యింది. ఖర్చు పాతిక లక్షల రూపాయలపైనే అయ్యింది. ఒక్క నెగిటివ్ ఫిల్మ్‌కు అయిన ఖర్చే మూడున్నర లక్షల రూపాయలు. సౌండ్ నెగిటివ్‌కు మరో రెండున్నర లక్షల రూపాయలు అయ్యింది. సినిమాకు పనిచేసిన తారలు, టెక్నిషియన్లు తమ యావచ్ఛక్తిని సినిమాకు ధారపోశారు. రష్ చూసిన ప్రతి ఒక్కరు సినిమాను ఆహా ఓహో అన్నారు. గొప్పగా ప్రశంసించారు. నాగిరెడ్డి-చక్రపాణిలు మురిసిపోయారు. తమ ఆధ్వర్యంలో వెలువడే కినిమా సినీ మాసపత్రిక 1953 డిసెంబర్ సంచికను చంద్రహారం స్పెషల్‌గా తీసుకొచ్చారు. ఇంత గొప్ప చిత్రానికి ఒక సంచికను యావత్తూ అంకితం చేయడానికి ఎంతైనా గర్విస్తున్నామని ప్రకటించారు.
-
- మ్యాట్నీతోనే సినిమా భవిష్యత్తు తేలిపోయింది 1954, జనవరి 6వ తేదీన సినిమా విడుదలయ్యింది. మ్యాట్నీ ఆట మొదలైన పావుగంటకే ప్రేక్షకులు ఆవులించడం మొదలుపెట్టారు. మరుసటి పావుగంటకు హాయిగా నిద్రపోయారు. సినిమా ఘోరంగా దెబ్బతింది. ప్రేక్షకులంతా ఇంకా పాతాళభైరవి మత్తులో జోగుతున్న సందర్భం అది. ఎన్టీఆర్ కథానాయకుడు అంటే ఇందులో కూడా బోలెడన్ని సాహసకృత్యాలు ఉంటాయని, హీరోయిజం ఉంటుందని అనుకున్నారు. కానీ చంద్రహారంలో ఎన్టీఆర్ పది రీళ్లు నిద్రపోతూనే ఉంటారు. చంచల చెలరేగిపోయి బెదిరిస్తూ ఉంటే బిక్కమొహం వేసుకుని ఉంటాడు. హీరోయిన్ ఏమో అస్తమానం తులసికోట చుట్టూ తిరుగుతూ పేరంటాళ్ల పాటలు పాడుతూ ఉంటుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడిగా అదరగొట్టిన ఎస్వీఆర్ ఇందులో మాలి అనే సాధుబాబా వేషం వేశారు. అసలు ఎస్వీఆర్ను ఈ పాత్రకు ఎందుకు ఎన్నుకున్నారో చిత్ర యూనిట్‌కే తెలియాలి. నెల్లూరులోని శేష్ మహల్లో విడుదలైన చంద్రహారం సినిమాను చూసేందుకు మొదటి రోజు ఫస్ట్ షోకు నాగిరెడ్డి-చక్రపాణి వెళ్లారు. ఇంటర్వెల్లో వీరిని గుర్తుపట్టిన కొందరు ఇంటర్వెల్ తర్వాత అయినా సినిమాలో కథ ఉంటుందా? హీరో నిద్ర లేస్తాడా. అని అడిగారు. వీళ్ల మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేదు. అప్పుడే సినిమా ఫ్లాప్ అని అర్థమైపోయింది. మర్నాడు ఉదయం ఇద్దరూ కూర్చొని సినిమాలోని తప్పులను బేరీజు వేసుకున్నారు. వారు చేసిన తప్పులకు పాతిక లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. 70 ఏళ్ల కిందట పాతిక లక్షల రూపాలయంటే ఇప్పడు ఎన్ని కోట్ల రూపాయలకు సమానమో లెక్కలు వేసుకోండి! మొత్తం మీద ఓ అద్భుత ప్రయోగం నిరర్థకంగా మారింది. ఈ సినిమా విజయవంతం అయి ఉంటే విజయా సంస్థ మరిన్ని భారీ చిత్రాలు తీసి ఉండేది. మరిన్ని ప్రయోగాలు చేసి ఉండేది.

Ehatv
Next Story