ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) వచ్చిన స్క్విడ్‌ గేమ్‌(Squid Game) వెబ్‌ సిరీస్‌ను చాలామంది చూసే ఉంటారు. ఈ వెబ్‌ సిరీస్‌ విడుదలైన 90 దేశాలలో నెంబర్‌ వన్‌గా కొనసాగిందంటే దీనికి ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో ఓ యోంగ్‌ సు(O Yeong-su) అనే నటుడు కీలక పాత్రలో కనిపిస్తాడు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) వచ్చిన స్క్విడ్‌ గేమ్‌(Squid Game) వెబ్‌ సిరీస్‌ను చాలామంది చూసే ఉంటారు. ఈ వెబ్‌ సిరీస్‌ విడుదలైన 90 దేశాలలో నెంబర్‌ వన్‌గా కొనసాగిందంటే దీనికి ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో ఓ యోంగ్‌ సు(O Yeong-su) అనే నటుడు కీలక పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడతడి వయసు 79 ఏళ్లు.. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే అతడి మీద 2017లో లైంగిక వేధింపుల(Sexual assault) ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగాలపై దక్షిణ కొరియా కోర్టు ఓ యోంగ్‌ సుకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం విధించింది. సువాన్‌ జిల్లా కోర్టు సియోంగ్నామ్‌ శాఖ ఈ శిక్షను ఖరారు చేసింది. గతంలో కూఆ ఓ యోంగ్‌ సుపై మరో లైంగిక వేధింపుల కేసు ఉంది. 2017లో ఓ ఊరిలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన ఓ యోంగ్ సు ఈ వేధింపులకు పాల్పడ్డాడట! కాకపోతే తాను ఏ తప్పు చేయలేదని ఓ యోంగ్‌ సు అంటుంటాడు. ఓ చెరువు దాటేందుకు సాయం కోసం ఆ మహిళ చేతిని పట్టుకున్నానే తప్ప దురుద్దేశంతో కాదని చెబుతున్నాడు. పైగా అప్పుడే ఆమెకు క్షమాపణ కూడా చెప్పానని అంటున్నాడు. అయితే ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు లభించడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. 50 ఏళ్లుగా ఓ యోంగ్‌ సు సినీ పరిశ్రమలో ఉంటూ వస్తున్నా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌తో మాత్రం ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

Updated On 16 March 2024 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story