ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన దేశాన్ని కదిలించి వేసింది. కలచి వేసింది. సినిమా ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది సంతాపం ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్‌(Allu Arjun), రష్మిక మందన్నా(Rashmika Mandanna), సల్మాన్‌ ఖాన్‌(Salman Khan), నివేదా పేతురాజ్‌(Niveda Pethuraj), కేజీఎఫ్‌(KGF) హీరో యశ్‌లు(Yash) సంతాపం వ్యక్తం చేశారు

ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన దేశాన్ని కదిలించి వేసింది. కలచి వేసింది. సినిమా ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది సంతాపం ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్‌(Allu Arjun), రష్మిక మందన్నా(Rashmika Mandanna), సల్మాన్‌ ఖాన్‌(Salman Khan), నివేదా పేతురాజ్‌(Niveda Pethuraj), కేజీఎఫ్‌(KGF) హీరో యశ్‌లు(Yash) సంతాపం వ్యక్తం చేశారు. 'ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన చూసి నా గుండె పగిలింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అంటూ అల్లు అర్జున్‌(Allu Arjun) ట్వీట్‌ చేశారు.

'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతున్నది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని రష్మిక మందన్నా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

'ఒడిశా రైలు దుర్ఘటన ఎంతమంది హృదయాలను కలచివేసిందో మాటల్లో వర్ణించడం కష్టం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు' అంటూ కేజీఎఫ్‌ హీరో యశ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రమాదంపై ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంతాపాన్ని తెలిపారు.

Updated On 3 Jun 2023 5:54 AM
Ehatv

Ehatv

Next Story