సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajini kanth) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య(aishwarya), సౌందర్యలకు సినిమాల మీద మంచి పట్టుంది. ఇద్దరూ దర్శకురాళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన రెండో కూతురు సౌందర్య ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.

Soundarya Rajinikanth
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajini kanth) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య(aishwarya), సౌందర్యలకు సినిమాల మీద మంచి పట్టుంది. ఇద్దరూ దర్శకురాళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన రెండో కూతురు సౌందర్య ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరో విష్ణువిశాల్(Vishnu Vishal), విక్రాంత్‌లు ప్రధాన భూమికలను పోషిస్తున్న లాల్ సలాం(Laal Singh) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రజనీకాంత్ అతిథిపాత్రలో నటిస్తున్నారు. కాగా రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య ఇంతకు ముందు తన తండ్రి హీరోగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అంతే కాదు, రజనీకాంత్ హీరోగా నటించిన చాలా సినిమాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేశారు. ఆ మధ్య ధనుష్ హీరోగా నటించిన వేలైయిల్లా పట్టాదారి సినిమాకు ఈమెనే దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా వచ్చి ఆరేళ్లవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు సౌందర్య రజనీకాంత్ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి అమెజాన్ ప్రైమ్ టైమ్ కోసం ఓ సినిమాను రూపొందిస్తున్నారు సౌందర్య. ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో వెల్లడించనుంది.
