తనలో మానవత్వం చాటుకోని.. రీల్ విలన్ కాస్తా.. రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూ సూద్‌(Sonu Sood). జనాలు సోనూను దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు. అవ్వడానికి సోనూసూద్ నార్త్ ఇండియన్ అయినా..ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఇక్కడి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు సోనూ సూద్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో(Social media) ధన్యవాదాలు చెప్పారు.

కరోనా(Corana) టైమ్ లో సోనూ సూద్ చేసిన సేవలు మర్చిపోలేనివి. అనారోగ్యంతో ఉన్నవారికి సాయం చేయడంలో పాటు..అడిగిన వారికి లేదనుకుంటా సాయం చేసే నటుడు సోనూ సూద్. రియల్ హీరోగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకన్నాడు. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోరు. వలస కార్మికులను సొంతింటికి పంపడం.. విదేశాల్లో చిక్కుకున్న వారిని సైతం ఇంటికి చేర్చడం.. ఉద్యోగాల విషయం సాయం చేయడం.. ఇలా ఎవరేది అడిగిన తనవంతు సాయం అందిస్తూ వస్తున్నారు సోనూ సూద్.

ఇక సోనూ సూద్ సేవని గుర్తించి ఎంతో మంది అభిమానులు ఆయను అభిమానించడం స్టార్ట్ చేశారు. అంతే కాదు.. సోనూను దేవుడిగా కొలిచేవారు లేకపోలేదు. మరికొంత మంది అయితే ఏఖంగా గుడి కట్టి పూజించడం స్టార్ట్ చేశారు. అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సైతం పలుమందికి సోనూ సూద్ తనవంతు సాయం అందించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) ఆయన కోసం గుడులు వెలిశాయి. హారతులు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు.

సోనూ సూద్ ను చూడటానికి పాదయాత్రలు చేశారు.. ఆయన కోసం మాలల వేసుకున్నారు. సోనూ సూద్ పై అభిమానులుచూపిస్తున్న ప్రేమకు..అది కూడా తెలుగు రాష్ట్రాలు అయిన.. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో(Twitter) ఓ వీడియోను పోస్ట్ చేసారు సోనూ సూద్. పలు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆయనకు ఇక్కడి వారు ఎంతటి ఘన స్వాగతం పలికారో ఆ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సోనూసూద్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Updated On 6 Nov 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story