బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) లేటెస్ట్‌గా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై పోస్ట్ చేసిన ఓ సందేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సోనమ్ కపూర్ తన చిత్ర విశేషాలు, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె సామాజికవేత్త ఎలియనోర్ రూజ్‌వెల్ట్‌కు(Eleanor Roosevelt) సంబంధించిన ఓ కోట్‌ను(Quote) షేర్ చేశారు. చిన్నబుద్ధి కలిగిన వారు ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడతారు.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) లేటెస్ట్‌గా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై పోస్ట్ చేసిన ఓ సందేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సోనమ్ కపూర్ తన చిత్ర విశేషాలు, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె సామాజికవేత్త ఎలియనోర్ రూజ్‌వెల్ట్‌కు(Eleanor Roosevelt) సంబంధించిన ఓ కోట్‌ను(Quote) షేర్ చేశారు. చిన్నబుద్ధి కలిగిన వారు ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఓ మాదిరిగా ఆలోచించేవారు పరిస్థితుల గురించి మాట్లాడతారు. గొప్ప మనసు కలిగిన వారు ఆలోచనల గురించి చర్చిస్తుంటారు అంటూ ఆమె మెసేజ్ పెట్టారు. కొనసాగింపుగా ఇది చిన్న విషయమే అయినప్పటికీ కొంత మంది దీనిని తెలుసుకోవాలనుకుంటున్నా.
ముఖ్యంగా ఎదుటివారిపై వచ్చిన వదంతుల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని గుర్తించుకోవాలని అనుకుంటున్నాను' అని పోస్ట్ చేశారు సోనమ్ కపూర్. దీనిని చూసిన నెటిజన్లు సోనమ్ కపూర్ ఇలా ఎందుకు పోస్ట్ చేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కింగ్ ఆఫ్ కోథా(King Of Kotha) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దగ్గుబాటి రానా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోనమ్ ఇలా పోస్ట్ చేశారని అంటున్నారు.
'గతంలో దుల్కర్ సల్మాన్(Dulqer Salmaan) నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ బాలీవు్ హీరోయిన్ షూటింగ్ మధ్యలో తన భర్తతో ఫోన్‌లో షాపింగ్ గురించి మాట్లడిందని, ఆమె కోసం దుల్కర్ వెయిట్ చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదని, ఆమె ఆ పరిస్థితిలో సరిగ్గా నటించకపోతే దుల్కర్ ఆమె కోసం మరోసారి ఆ సన్నివేశాలలో నటించడానికి ముందుకు వచ్చారని రానా పేర్కొన్నాడు. తను చేసిన ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్ కావడంతో మరుసటి రోజు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ ఈ పోస్ట్ పెట్టడంతో మరోసారి సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.