నటి సోనాక్షి సిన్హా.. నటుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న ముంబైలో వివాహం

నటి సోనాక్షి సిన్హా.. నటుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న ముంబైలో వివాహం చేసుకోనున్నారు. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు, కానీ ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు బహిరంగంగా చెప్పలేదు. వారు కలిసి కనిపించడం, పలు సోషల్ మీడియా పోస్ట్‌లు పెడుతూ ఉండడంతో వారి మధ్య బంధం గురించి మీడియాలో చర్చించారు. ఈ నెల ప్రారంభంలో, జహీర్ సోనాక్షికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరికీ సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు.

మూలాల ప్రకారం, వారి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో పాటు, హీరామాండి మొత్తం తారాగణాన్ని వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రిక మ్యాగజైన్ కవర్ లాగా రూపొందించారు. ముంబయిలోని బాస్టియన్‌లో వివాహ వేడుకలు జరుగుతాయని తెలిపారు. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది.

Updated On 10 Jun 2024 12:09 AM GMT
Yagnik

Yagnik

Next Story