ఓ పర్‌ఫెక్ట్ బాలీవుడ్ క్రైమ్ మూవీకి కావాల్సినంత సరుకు ఉంది వివాహిత రాధ హత్య కేసులో! ఈ క్రైమ్ కథలో అనేకానేక ట్విస్టులు ఉన్నాయి. ఉత్సుకతను రేపే సస్పెన్స్ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. పోలీసులను కూడా కాసింత గందరగోళానికి నెట్టింది. వారు ఈ కేసును ఓ ఛాలెంజ్‌లా తీసుకోడానికి ప్రేరేపించింది. రాధను చంపింది ఆమె స్నేహితుడేనని మొదట పోలీసులు అనుకున్నారు. పెద్దమొత్తంలో అప్పు తీసుకున్న ఆ ఫ్రెండ్ దాన్ని తీర్చలేక రాధను కడతేర్చాడని ప్రచారం జరిగింది. ప్రాథమికంగా దొరికిన ఆధారాలతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. రెండు రోజులపాటు మీడియాలో ఏవేవో కథనాలు. కొందరు క్రైమ్ రిపోర్టర్లు తమకు తోచినట్టు కథనాలు వండారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కిరాయి హంతకులపైనా ఆరా తీశారు.
ఓ పర్‌ఫెక్ట్ బాలీవుడ్ క్రైమ్ మూవీకి కావాల్సినంత సరుకు ఉంది వివాహిత రాధ హత్య కేసులో! ఈ క్రైమ్ కథలో అనేకానేక ట్విస్టులు ఉన్నాయి. ఉత్సుకతను రేపే సస్పెన్స్ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. పోలీసులను కూడా కాసింత గందరగోళానికి నెట్టింది. వారు ఈ కేసును ఓ ఛాలెంజ్‌లా తీసుకోడానికి ప్రేరేపించింది. రాధను చంపింది ఆమె స్నేహితుడేనని మొదట పోలీసులు అనుకున్నారు. పెద్దమొత్తంలో అప్పు తీసుకున్న ఆ ఫ్రెండ్ దాన్ని తీర్చలేక రాధను కడతేర్చాడని ప్రచారం జరిగింది. ప్రాథమికంగా దొరికిన ఆధారాలతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. రెండు రోజులపాటు మీడియాలో ఏవేవో కథనాలు. కొందరు క్రైమ్ రిపోర్టర్లు తమకు తోచినట్టు కథనాలు వండారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కిరాయి హంతకులపైనా ఆరా తీశారు.
కొత్త సెల్‌సిమ్ ఆధారంగా సాగిన దర్యాప్తులో ఊహించని వాస్తవం వెలుగులోకి వచ్చింది. రాధను చంపింది ఆమె భర్తేనని తేలింది. పోలీసులే షాక్ అయ్యారు. ఫ్రెండ్ ముసుగులో చాట్ చేసి, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ వేసి రాధను చంపాడు.వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన మేడం సుధాకరరెడ్డి కూతురు రాధ. ఈమెను కోదాడకు చెందిన కోటి కృష్ణారెడ్డి కుమారుడు కోట మోహన్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మోహన్‌రెడ్డి, రాధ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన కాశిరెడ్డి హైదరాబాద్‌లో ఉండేవాడు. కాశిరెడ్డి, రాధ ఇద్దరూ చైల్డ్‌వుడ్ ఫ్రెండ్స్. వ్యాపారం చేసుకుంటానంటూ రాధ, మోహన్‌రెడ్డి దంపతుల దగ్గర్నుంచి సుమారు 1.27 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు కాశిరెడ్డి. తీసుకున్న అప్పు చెల్లించడకపోవడం అటుంచి ఐపీ నోటిస్ పంపించడంతో రాధా, మోహన్‌రెడ్డిల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాధపై అనుమానం పెంచుకున్న మోహన్‌రెడ్డి ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కాగా ప్లాన్ వేశాడు. రాధ ఊరైన జిల్లెళ్లపాడులో జరిగే అమ్మవారి కొలువులను తన ప్లాన్‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. ఫ్రెండ్ పేరుతో సిమ్‌లు మారుస్తూ భార్యతో ఛాటింగ్ చేశాడు. కాశిరెడ్డినే ఛాట్ చేస్తున్నాడనుకుంది రాధ. కాశిరెడ్డి డబ్బు ఇస్తాడంటూ 17వ తేదీ సాయంత్ర రాధ జిల్లెళ్లపాడుకు వెళ్లింది. చిన్న కొడుకుని బాబాయ్ ఇంట్లో ఉంచి షాపింగ్ చేసింది. రాత్రి ఏడుగంటల వరకూ సీసీ కెమెరాల్లో రాధ కదలికలు కనిపించాయి. పామూరు బస్టాండ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన కారు ఎక్కింది రాధ. అప్పట్నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆ రోజు రాత్రి రాధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్ధరాత్రి 12.50 గంటలకు ఫోన్ లొకేషన్ గుర్తించారు పోలీసులు. జిల్లెళ్లపాడు అడ్డరోడ్డు వద్ద రాధ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు పోలీసులు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డబ్బులు ఇస్తానని కాశిరెడ్డి చెప్పడంతోనే రాధ కనిగిరికి వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. రాధను చంపింది కాశిరెడ్డేనని అన్నారు. అందరూ అలాగే అనుకున్నారు. పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేశారు. 17వ తేదీ మధ్యాహ్నం భర్త మోహన్‌రెడ్డి , కుటుంబ సభ్యులు వచ్చి రాధా మృతదేహాన్ని కోదాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అప్పుడు కూడా మోహన్‌రెడ్డిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. దర్యాప్తు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో పోలీసులు వేగాన్ని పెంచారు. టెక్నాలజీని నమ్ముకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సిమ్ మోహన్‌రెడ్డిదేనని తెలుసుకున్నారు. అయినప్పటికీ మరో మూడు రోజులూ లోతుగా దర్యాప్తు చేశారు పోలీసులు. చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడసాగాయి. కాశిరెడ్డి పేరుతో మోహన్‌రెడ్డి భార్యకు ఫేక్ మెసేజ్‌లు పెట్టి చాటింగ్ చేసేవాడని పోలీసులు కనుగొన్నారు. 13వ తేదీన కనిగిరికి ఒంటరిగారావాలని పెట్టిన మెసేజ్‌కు రాధ రియాక్టవ్వలేదు. మళ్లీ 15న అదే మెసేజ్ పెట్టాడు.
హైదరాబాద్‌లోని మార్గ మధ్యంలో సంగారెడ్డి నుంచి పఠాన్ చెరువుకు వెళ్లే దారిలో చెరుకు రసం అమ్మే మహిళ ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్‌లోని సిమ్‌ను దొంగిలించి కాశిరెడ్డి చేసినట్లు ఫోన్ మెసేజ్ చాటింగ్ చేశాడు. 16వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో లాంగ్ డ్రైవ్ రెంటెడ్‌కార్‌ను తీసుకున్నాడు. కనిగిరిలో కలుద్దాం రమ్మని కాశిరెడ్డిలా రాధకు మళ్లీ మెసేజ్‌లు పెట్టాడు. రాత్రికి ఒంగోలులో బసచేశాడు. 17వ తేదీన ఒంగోలు నుంచి సాయంత్రం నాలుగు గంటలకు కనిగిరి చేరాడు మోహన్‌రెడ్డి. ఈ మధ్య సమయంలో కాశిరెడ్డిలా రాధతో మెసేజ్ చాటింగ్ చేస్తూ వచ్చారు. సాయంత్రం 6 గంటలకు రాధ కనిగిరికి వచ్చింది. 6.47 గంటలకు రాధ ఉన్న ప్లేస్‌కు మోహన్‌రెడ్డి కారులో వచ్చాడు. కాశిరెడ్డి వస్తాడనుకున్న రాధకు భర్త మోహన్‌రెడ్డి రావడంతో దిగ్భ్రాంతి చెందింది. భర్తే కదా అని అనుకుని కారులో ఎక్కింది రాధ. ఎన్‌హెచ్ 565 రోడ్డు మాచవరం సమీపంలోని డిగ్రీ కళాశాల దగ్గర కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రాధకు బాబాయి, నాన్న దగ్గర నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. అయినా వాటిని రాధ లిఫ్ట్ చేయలేదు. అక్కడ ఇద్దరికీ కారులో గొడవ జరిగింది. రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రాధపై మోహన్‌రెడ్డి దాడి చేసి చున్నీతో గొంతు నులిమి, గట్టిగా కొట్టి చంపేశాడు. 11 గంటల సమయంలో అదే కారులో వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు సమీపంలో క్రాస్ రోడ్డు దగ్గరకు తీసుకెళ్లి భార్య మృతదేహాన్ని అక్కడ పడేశాడు. ఒంటిపై ఉన్న నగలను తీసుకున్నాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య శవంపై కారును ఎక్కించాడు.
కారును శానిటైజర్‌తో పూర్తిగా కడిగాడు. హై స్పీడ్‌తో మిర్యాలగూడకు వచ్చాడు. అక్కడ మరో కారులో తల్లిదండ్రులను తీసుకుని 18వ తేదీన కనిగిరికి వచ్చాడు. భార్య మృతదేహాన్ని కోదాడ తీసుకెళ్లి
అంత్యక్రియలు చేశాడు. 19వ తేదీ రాత్రి ఆధునిక టెక్నాలజీ సాయంతో భర్తే హంతకుడని తెలుసుకున్నారు పోలీసులు. 20, 21 తేదీల్లో సమగ్రంగా విచారించారు. మోహన్‌రెడ్డి ఒక్కడే రాధను హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.