తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్(Thalapathy Vijay) కొత్త సినిమా లియో(Leo).. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanakaraj) దీనికి దర్శకుడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొన్నీమధ్య ఈ సినిమాలోని నా రెడీ(Naa Ready) అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది.

Naa Ready Song
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్(Thalapathy Vijay) కొత్త సినిమా లియో(Leo).. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanakaraj) దీనికి దర్శకుడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొన్నీమధ్య ఈ సినిమాలోని నా రెడీ(Naa Ready) అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలో విజయ్ పొగాకు(tobacco) వినియోగాన్ని ప్రోత్సహించేలా సిగరెట్(Cigaratte) తాగుతూ కనిపించారని, ఆయన మీద మాదకద్రవ్యాలనియంత్రణ చట్టం కింద కేసు పెట్టాలన చెన్నైకు చెందిన సామాజిక కార్యకర్త(Social worker) సెల్వం(selvam) కోర్టుకు వెళ్లారు. నా రెడీ అనే మాస్ పాటను ఇటీవల హీరో విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.
పాటలోని కొన్ని సన్నివేశాలలో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదానికి కారణమయ్యింది. ఇటీవల పదో తరగతి విద్యార్థులతో హీరో విజయ్ నిర్వహించిన సమావేశంలో నైతిక విలువలు, క్రమశిక్షణ గురించి సుదీర్ఘ ప్రసంగం చేసిన విజయ్ తన సినిమాల్లో చెడు వ్యసనాలను ప్రోత్సహించేలా ఎందుకు కనిపించాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు కొందరు. అయితే సెల్వం కోర్టుకు వెళ్లిన వ్యవహారంపై విజయ్ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఊహించినట్టుగానే ఈ వ్యవహారంపై విజయ్ అభిమానులు మడిపడుతున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని, నిజ జీవితంలో విజయ్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెబుతున్నారు.
