శోభితా ధూళిపాళ్ల లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్సులో సాలిడ్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్సులో సింప్లిసిటీ టచ్‌తో వచ్చినా మినిమలిస్టిక్ మేకప్‌తో తన డ్రెస్సును బ్లెండ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ భామ ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనిల్ కపూర్‌తో నటించిన ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భామ ‘మేజర్’, ‘గూఢచారి’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు గర్ల్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె నార్త్ భామలను మించిపోయేలా గ్లామర్ షోలతో రెచ్చిపోతుంది. 30 ఏళ్ల ఈ అందగత్తెకు తెలుగుతోపాటు హిందీ, తమిళంనూ మంచి అవకాశాలను దక్కించుకుంటుంది.
ఇక ‘ది నైట్ మేనేజర్ పార్ట్ టూ కూడా రాబోతుంది. త్వరలో ‘మేడ్ ఇన్ హెవెన్’ సెకండ్ సీజన్లో కూడా కనిపించనుంది శోభిత. నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘మంకీ మ్యాన్’, ఏప్రిల్ 28న విడుదలకానుంది. పొన్నియిన్ సెల్వన్-2లో కూడా నటించనుంది ఈ తెలుగమ్మాయి.
1993 మే 31న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో శోభితా ధూళిపాళ్ల జన్మించింది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె విశాఖలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ముంబై యూనివర్శిటీ, హెచ్.ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది ఈ హాట్ భామ.
డాన్స్ ఇష్టం ఉండటంతో భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకుంది శోభిత. ఆ తర్వాత 2013లో మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది ఈ భామ.
2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది శోభితా. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి హిందీ చిత్రాల్లో నటించి గూఢచారి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైంది ఈమె.
ఇక ఈ భామ ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌లో బెస్ట్ యాక్టర్ గా ఐరీల్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. అలాగే కురుప్ చిత్రంకిగాను బెస్ట్ లీడింగ్ రోల్లో సైమా అవార్డ్స్‌కి నామినేట్ అయింది శోభితా. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఈ భామకు 2.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.