నటభూషణ శోభన్‌బాబు(shabhan babu) కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన కోడెనాగు(Kodenagu) సినిమా వచ్చి ఇవాళ్టికి సరిగ్గా 50 ఏళ్లు. 1974, మార్చి 15న ఈ సినిమా విడుదలయ్యింది. కౌముది పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి (MS Reddy) ఈ సినిమాను నిర్మించారు. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించారు. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో చంద్రకళ, లక్ష్మి హీరోయిన్లుగా నటించారు.

నటభూషణ శోభన్‌బాబు(shabhan babu) కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన కోడెనాగు(Kodenagu) సినిమా వచ్చి ఇవాళ్టికి సరిగ్గా 50 ఏళ్లు. 1974, మార్చి 15న ఈ సినిమా విడుదలయ్యింది. కౌముది పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి (MS Reddy) ఈ సినిమాను నిర్మించారు. కె.ఎస్‌.ప్రకాశరావు(KS Prakashrao) దర్శకత్వం వహించారు. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో చంద్రకళ(Chandrakala), లక్ష్మి(Lakshmi) హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ గీత రచయిత ఆత్రేయ ఓ కీలకమైన పాత్రను పూర్తి స్థాయిలో పోషించి మెప్పించారు. కథ విషయానికి వస్తే నాగరాజు (శోభన్‌బాబు)ది దుండుడుకు స్వభావం. చిన్నప్పట్నుంచి కోపం ఎక్కువ. తను అనుకున్నదే జరగాలన్న మనస్తత్వం. పాములోడు పామును ఆడిస్తుంటే దాన్ని పట్టుకుపోయి ఆనందిస్తాడు. పరీక్షలో కాపీ కొడుతూ ఉంటే పట్టుకుని బయటకు పంపించిన ప్రిన్సిపాల్‌ను బట్టలూడదీసి ఇంటి ముందున్న కరెంట్ స్తంభానికి కట్టేస్తాడు. నాగరాజు ఆగడాలను చూసి తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు. ఎవరి మాట వినడు కానీ స్కూల్‌ మాస్టర్‌ చెబితే మాత్రం వింటాడు. నాగరాజు కాలేజీ ఫ్రెండ్‌ చెల్లెలును ఓ వ్యక్తి ఏడిపిస్తుంటాడు. వాడిని నాగరాజు చితక్కొడతారు. అప్పట్నుంచి ఆమె (చంద్రకళ) నాగరాజు ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుందామనుకుంటారు. కానీ ఆమె ఇంట్లో ఒప్పుకోరు. తమ కులంవాడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ విషయం స్కూల్ మాస్టర్‌కు తెలుస్తుంది. స్వార్థ పూరిత ప్రేమకంటే త్యాగం గొప్పది అని ఆయన నాగరాజుకు బోధిస్తాడు. దాంతో నాగరాజు ప్రేమను త్యాగం చేస్తాడు. తర్వాత ఆమెను ఓ స్టార్‌ హోటల్‌లో కాల్‌గర్ల్‌గా చూస్తాడు. తన భర్తనే ఆ వృత్తిలోకి బలవంతంగా తోశాడని ఆమె చెప్పడం అతడిని అమితంగా బాధిస్తుంది. తర్వాత అతడి జీవితంలో ఓ క్రైస్తవ అమ్మాయి ప్రవేశిస్తుంది. మొదట నాగరాజును ఆమె టీజ్‌ చేస్తుంది. ఇగో దెబ్బతినడంతో ఆమెను అందరి ముందు ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత ఆమె నాగరాజును ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒక్కటవ్వాలనుకుంటారు. మతాంతర వివాహాన్ని సమాజం ఒప్పుకోదు. మళ్లీ స్కూల్‌ మాస్టర్‌ హిత బోధ చేద్దామనుకుంటాడు. ఈసారి ఆయన మాట కూడా వినడు. ఇద్దరూ కలిసి కొండపై నుంచి దూకి కన్నుమూస్తారు. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషనల్‌..ఇంకా ఈ సినిమాలో ధూళిపాల, ముక్కామల, చంద్రమోహన్‌, రావుగోపాలరావు, రాజబాబు, సూర్యాకాంతం, నిర్మల నటించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పుట్టన్న కనగల్‌ తీసిన కన్నడ చిత్రం నాగరహావుకు రీమేక్‌. నాగరహావు సినిమా విజయవంతం అయ్యాక తమిళంలో శ్రీకాంత్‌ హీరోగా రాజనాగమ్‌గా తీశారు. అక్కడ కూడా విజయం సాధించడంతో తెలుగులో తీశారు. హిందీలో రషి కపూర్‌ హీరోగా జరీలాఇన్‌సాన్‌ పేరుతో రీమేక్‌ చేశారు.

Updated On 15 March 2024 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story