పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన సినిమా ఖుషి. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.జె.సూర్య(S. J. Surya ). తర్వాత మహేశ్‌బాబు(Mahesh Babu)తో నాని తీశారు. పవన్‌తో పులి సినిమా తీశారు. రెండు సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. తమిళంలో మాత్రం సూర్య సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీశారు. చాలా సినిమాల్లో హీరో పాత్రలు ధరించాడు. మహేశ్‌బాబు నటించిన స్పైడర్‌ సినిమాలో విలన్‌గా నటించాడు.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన సినిమా ఖుషి. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.జె.సూర్య(S. J. Surya ). తర్వాత మహేశ్‌బాబు(Mahesh Babu)తో నాని తీశారు. పవన్‌తో పులి సినిమా తీశారు. రెండు సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. తమిళంలో మాత్రం సూర్య సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీశారు. చాలా సినిమాల్లో హీరో పాత్రలు ధరించాడు. మహేశ్‌బాబు నటించిన స్పైడర్‌ సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలలో విలన్‌గా నటిస్తున్నాడు సూర్య. శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా వస్తున్న గేమ్‌ చేంజర్‌లో సూర్యనే విలన్‌. అలాగే శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్‌-2 సినిమాలో కూడా సూర్యనే విలన్‌గా నటిస్తున్నాడు. అయితే భారతీయుడు -2లో సూర్య నటిస్తున్నాడో లేదో అన్నది ఇంకా కన్ఫామ్‌ కాలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’(Indian 2). 1996లో వచ్చిన భారతీయుడు వచ్చిన సినిమా ఘన విజయం సాధించింది. కమల్‌హాసన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్‌-2ను రూపొందిస్తున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ చెన్నైలో ముగిసింది. తర్వాతి షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. పది రోజుల పాటు అమెరికాలో షూటింగ్‌ జరగనుంది.

Updated On 7 Jun 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story