తన మ్యూజిక్ మ్యాజిక్ తో మెస్మారైజ్ చేశాడు ప్రముఖ డ్రమ్మర్ శివమణి(Shivamani). ఎయిర్ పోర్ట్ లో(Airport).. ప్రయాణికుల ఒత్తిడిని క్షణాల్లో దూరం చేశాడు. విమాన ప్రయాణాల్లో కొందరికి ఊహించని అనుభవం ఎదురవుతుంటుంది. ఫ్లైట్ మిస్ అవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఎక్కువగా లగేజీ విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతుంటాయి. కొంత మంది లగేజీ పోగొట్టుకోవడం చూస్తుంటాం. లేదా కొన్ని సందర్భాల్లో లగేజీ ఆలస్యమవుతుంటుంది.
తన మ్యూజిక్ మ్యాజిక్ తో మెస్మారైజ్ చేశాడు ప్రముఖ డ్రమ్మర్ శివమణి(Shivamani). ఎయిర్ పోర్ట్ లో(Airport).. ప్రయాణికుల ఒత్తిడిని క్షణాల్లో దూరం చేశాడు. విమాన ప్రయాణాల్లో కొందరికి ఊహించని అనుభవం ఎదురవుతుంటుంది. ఫ్లైట్ మిస్ అవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఎక్కువగా లగేజీ విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతుంటాయి. కొంత మంది లగేజీ పోగొట్టుకోవడం చూస్తుంటాం. లేదా కొన్ని సందర్భాల్లో లగేజీ ఆలస్యమవుతుంటుంది. తాజాగా ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి కి అలాంటి అనుభవమే ఎదురైంది. కాని ఈ టైమ్ ను శివమణి నలుగురిని ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగించుకున్నాడు.
కేరళలోని(Kerala) కొచ్చి(Kochi) విమానాశ్రయం లో దిగారు శివమణి.. అయితే తన లగేజీ కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వెయిట్ చేస్తున్నాడు. అయితే, తన బ్యాగులు రావడానికి చాలా ఆలస్యం అయ్యింది. ఫ్లైట్ దిగి దాదాపు 40 నిమిషాలైనా ప్రయాణికుల బ్యాగులు రాకపోవడంతో అంతా నిరాశతో కూర్చున్నారు. ఆ సమయంలో ఒకింత అసహనానికి గురైన డ్రమ్స్ శివమణి.. తన చేతులకు పని చెప్పాడు.
తనకు ప్రాక్టీస్ అయ్యేలా.. అక్కడ ఉన్నవారి నిరాశను తరిమికొట్టి.. వారిలో ఉత్సాహాన్ని నింపాడు..మెటాలిక్ కన్వేయర్ బెల్ట్‌ను డ్రమ్స్‌గా చేసుకొని.. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ ఆలపించిన హమ్మా హమ్మా బీట్‌ను ప్లే చేసి ప్రయాణికులను అలరించాడు . దాంతో అంత నీరసంగా ఉన్న ప్రయాణికులు కాసేపు సేదతీరారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.