టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తమిళ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. గతంలో తమిళ దర్శకులతో పని చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎదురుచూసేవారు.. కాని సూర్య, మురుగదాస్ తదితరులు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు. కాని ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తుండటం.. మన మార్కెట్ ఇంటర్నేషనల్ లెవల్లో పెరగడంతో.. మనదగ్గర సినిమాలు చేయడానికి తమిళ హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు విజయ్, ధనుష్.. డైరెక్ట్ తెలుగు మూవీ.. తెలుగు దర్శకులతో చేశారు. ఇక ఇప్పుడు తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) రెండోసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నారు.

టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తమిళ హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు విజయ్, ధనుష్.. డైరెక్ట్ తెలుగు మూవీ.. తెలుగు దర్శకులతో చేశారు. ఇక ఇప్పుడు తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ రెండోసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నారు.

టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తమిళ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. గతంలో తమిళ దర్శకులతో పని చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎదురుచూసేవారు.. కాని సూర్య, మురుగదాస్ తదితరులు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు. కాని ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తుండటం.. మన మార్కెట్ ఇంటర్నేషనల్ లెవల్లో పెరగడంతో.. మనదగ్గర సినిమాలు చేయడానికి తమిళ హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు విజయ్, ధనుష్.. డైరెక్ట్ తెలుగు మూవీ.. తెలుగు దర్శకులతో చేశారు. ఇక ఇప్పుడు తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) రెండోసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నారు.

ఒకప్పటిలా కాదు ఇప్పుడు ట్రెండ్ మారింది. తమిళ హీరోలే తెలుగు డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. అందులో శివ కార్తికేయన్ కూడా ఉన్నారు. రెమో,డాక్టర్ వరుణ్,డాన్‌ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన శివకార్తికేయన్, తాజాగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ (Anudeep KV) తో కలిసి ప్రిన్స్ మూవీ చేశారు. ఈసినిమా తరువాత ఆయన తెలుగు దర్శకులతో పని చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి మరో తెలుగు దర్శకుడిని ఆయన అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

తెలుగులో ఓ మోస్తరుగానే ఆడిన ప్రిన్స్ సినిమాకు తమిళ్ లో మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు శివ కార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా డైరెక్టర్ తో శివకార్తికేయన్ సినిమా చేయబోతుననారట.గోపీచంద్ తో జిల్, ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) డైరెక్షన్ లోశివకార్తికేయన్ నటిస్తారని సమాచారం.అంతేకాదు ఈసినిమాను భారీ సినిమాలు తెరకెక్కించే యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం.

రాధాకృష్ణ కథ చెప్పడం.. అది కార్తికేయన్‌కు నచ్చడంతో పాటు.. సినిమాను కూడా త్వరగానే స్టార్ట్ చేద్దాం అన్నారట యంగ్ హీరో. దాంతో మూవీని వెంటనే స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శివకార్తికేయన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసి రాధాకృష్ణతో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈమూవీ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated On 27 March 2023 8:00 AM GMT
Ehatv

Ehatv

Next Story