రీసెంట్గా ధనుష్(Dhanush), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి(Venky Atluri)దర్శకత్వంలో వచ్చిన "సార్(Sir)/వాతి(Vaathi)" సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇవాళ వెంకీ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా(Venky Atluri Special).. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్(Next Project) ను అనౌన్స్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ(Sithara Entertainments).

Venky Atluri New Project Announcement
రీసెంట్గా ధనుష్(Dhanush), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి(Venky Atluri)దర్శకత్వంలో వచ్చిన "సార్(Sir)/వాతి(Vaathi)" సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇవాళ వెంకీ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా(Venky Atluri Special).. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్(Next Project) ను అనౌన్స్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ(Sithara Entertainments).
'వాథి' తమిళ చిత్రాన్ని తెలుగులో 'సార్' పేరుతో రిలీజ్ చేయగా తెలుగు కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు భాషల్లో ఈ సినిమాని రూపొందించగా.. రెండు భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం సితార ఎంటర్ టైన్‌మెంట్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
ప్రియమైన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ #VenkyAtluriకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.. #Production24తో ఇంకో బ్రాహ్మాండమైన ఎంటర్టైనర్ ఇవ్వాలంటూ ట్విట్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియాల్సి ఉంది. 'రంగ్ దే', 'సర్' సినిమాల తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరితో సితార సంస్థ 24వ సినిమా చేస్తోంది.
https://twitter.com/SitharaEnts/status/1643871072473980928/photo/1