కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ సక్సెస్ లు సాధిస్తుంటాయి. అలాంటిసినిమానే సీతారామం. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో హీరోగా చేసిన మూవీ..మృణాల్ ఠాకూర్ () హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమూవీని హనూరాఘవపూడి డైరెక్ట్ చేశాడు. హను రాఘవపూడికి క్లాసిక్ సినిమాల దర్శకుడిగా మంచి పేరు ఉంది. కాని వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న హనుకి ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. ఇక దుల్కర్ కి మలయాళం, తమిళంలో క్రేజ్ ఉంది కానీ.. తెలుగు మార్కెట్ లో మాత్రం పెద్దగా ఇమేజ్ లేదు. దాంతో టాలీవుడ్ పై గట్టిగా కన్నేశాడు ఈ హీరో. సీతారామంతో అది సాధించాడు కూడా.
కొన్ని సినిమాలు ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తే.. కొన్ని సినిమాలకు ఆడియన్స్ సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అలాంటి సినిమానే సీతారామం(Sita Ramam). ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ సాధించిన ఈసినిమా.. తాజాగా ఒ గొప్ప గౌరవాన్ని కూడా అందుకుంది.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ సక్సెస్ లు సాధిస్తుంటాయి. అలాంటిసినిమానే సీతారామం. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో హీరోగా చేసిన మూవీ..మృణాల్ ఠాకూర్ () హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమూవీని హనూరాఘవపూడి డైరెక్ట్ చేశాడు. హను రాఘవపూడికి క్లాసిక్ సినిమాల దర్శకుడిగా మంచి పేరు ఉంది. కాని వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న హనుకి ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. ఇక దుల్కర్ కి మలయాళం, తమిళంలో క్రేజ్ ఉంది కానీ.. తెలుగు మార్కెట్ లో మాత్రం పెద్దగా ఇమేజ్ లేదు. దాంతో టాలీవుడ్ పై గట్టిగా కన్నేశాడు ఈ హీరో. సీతారామంతో అది సాధించాడు కూడా.
ఇక మృణాల్ ఠాకూర్ కు ఈసినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ రావడంతో పాటు..వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక ఈసినిమా అచనాలు లేకుండా రిలీజ్ అయ్యి... తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్‌లు సాధించింది. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. డైరెక్టర్ హను రాఘవపూడి టేకింగ్, విజన్‌కు ఆడియనస్ తో పాటు.. ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు.
విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులు సృష్టించడంతో పాటు, తాజాగా అరుదైన ఘనత కూడా సాధించింది. ఇండియన్ ఫిల్మ్స్ లో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సీతారామం మూవీ గెలుచుకుంది. పదమూడవ దాదా సాహెబ్ ఫాల్కే (Dada saheb phalke award) ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరి కేటగిరీలో సీతారామం ఉత్తమ సినిమా అవార్డు అందుకుంది. కల్ట్ క్లాసికల్ లవ్‌స్టోరీగా నిలిచిన ఈ సినిమాకు ఇంత గొప్ప అవార్డు రావడంతో మూవీ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది.