బాలీవుడ్ భామ హైదరాబాద్ లో ఇల్లు కొనేసిందట మృణాల్ ఠాకూర్. .టాలీవుడ్ లో సెటిల్ అయిపోతోంది సీతారామం బ్యూటీ. తెలుగులో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ముంబయ్ బ్యూటీ... హైదరాబాద్ కు మకాం మార్చేయబోతుందట.

బాలీవుడ్ భామ(Bollywood Heroine) హైదరాబాద్(Hyderabad) లో ఇల్లు కొనేసిందట మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). .టాలీవుడ్ లో సెటిల్ అయిపోతోంది సీతారామం బ్యూటీ(Sita Ramam Hroine). తెలుగులో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ముంబయ్ బ్యూటీ... హైదరాబాద్ కు మకాం మార్చేయబోతుందట.

మరాఠా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది మృణాల్ ఠాకూర్. అలానే బాలీవుడ్ చేరి.. తన టాలెంట్ తో ఒక్కో అడుగు ఎక్కుతూ వస్తోంది మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన చిన్నది.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఈసినిమాతో స్టార్ హీరోల కంట పడింది చిన్నది. ఇక్కడ వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తోంది.

బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది మృణాల్. హృతిక్ రోషన్(Hrithik Roshan) జోడీగా సూపర్ 30(Super 30), జాన్ అబ్రహం(John Abraham)తో బాట్లా హౌస్(Batla House), ఫర్హాన్(Farhan) జంటగా తుఫాన్ సినిమా(Thoofan Movie)ల్లో నటించి బాలీవుడ్ ఆడిమన్స్ కళ్ళను తనవైపు తిప్పుకుంది. టాలీవుడ్ చేరిన మృణాల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి..వరుస అవకాశాలు సాధిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా తను మెచ్చిన.. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది చిన్నది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఇమేజ్ సాధించాలని చూస్తోంది.

తెలుగులో స్టార్ హీరోయిన్ ప్లేస్ పై గురి పెట్టింది బ్యూటీ.. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో ఉంది. దానికి తగ్గట్టుగానే మృణాల్ ప్రయత్నాలు కూడా మొదలటు పెట్టింది. అందుకే.. టాలీవుడ్ కు దగ్గరగా ఉండాలని.. హైదరాబాద్ లో ఇల్లు(New House In Hyderabad)కూడా కొనేసిందట బ్యూటీ. ఇక సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తెలుగు పరిశ్రమకుదగ్గరవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది సీత.

ప్రస్తుతం నాని 3(Nani30), సూర్య వీర్‌(Surya Veer) సినిమాల్లో నటిస్తున్నదీ భామ. సౌత్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తుండటంతో.. ఇక్కడేసెటిల్ అవ్వాలని చూస్తోంది చిన్నది. ఈక్రమంలోనే ఆమె హైదరాబాద్ లో సొంత ఇల్లుకూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
తెలుగులో అవకాశాలు పెరిగిన హీరోయిన్లు .. ఇక్కడ అంటే హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కోవడం.. అలవాటుగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగిని నార్త్ భామలు అందరికి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి. . ఈ క్రమంలోనే మృణాల్‌ ఠాకూర్‌ కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుందట. కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుందట.

ప్రస్తుతం మృణాల్ కెరీర్‌ పరుగులు పెడుతోంది. రెండు పడవల ప్రయాణం చేయకుండా.. బాలీవుడ్ కు కాస్త విరామం ఇచ్చి.. తెలుగు సినిమాలద్వారా పాన్ ఇండియా కు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మృణాల్ నానీ సరసన నటించే సినిమా పాన్ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది తెలుగుతో పాటు 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో గుమ్రా, పూజా మేరీ జాన్‌, పిప్పా, ఆంఖ్‌ మిచోలి వంటి క్రేజీ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం మరికొన్ని హిందీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Updated On 21 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story