మృణాలిని ఠాకూర్. ఈ పేరు చెబితే తెలియని వారు ఉంటారేమో కానీ.. సీతారామమ్ హీరోయిన్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఆ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2022లో తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది సీతారామమ్ మూవీ. హను రాఘపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్‌గా, మృణాలిని ఠాకూర్ ప్రిన్సెస్ నూర్జహాన్ సీతామహాలక్ష్మిగా నటించి ప్రేక్షకుల […]

మృణాలిని ఠాకూర్. ఈ పేరు చెబితే తెలియని వారు ఉంటారేమో కానీ.. సీతారామమ్ హీరోయిన్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఆ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2022లో తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది సీతారామమ్ మూవీ. హను రాఘపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్‌గా, మృణాలిని ఠాకూర్ ప్రిన్సెస్ నూర్జహాన్ సీతామహాలక్ష్మిగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసుకున్నారు. సుమంత్, రష్మిక మందన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో ప్రేమకధల జోనరుకు మళ్లీ ప్రాణం పోసింది. ఆర్మీ యువకుడి ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక మృణాలిని విషయానికి వస్తే, మహరాష్ట్రలోని ధూలేలో జన్మించారు. 2014 మరాఠీ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చారు. బాలీవుడ్‌లో హిందీ రీమేక్ జెర్సీతో సహా 2 సినిమాలు చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరపై, బుల్లితెరపై ఎన్నో పాత్రలు పోషించినా రాని గుర్తింపు..... 2022 సీతారామమ్ మూవీ ద్వారా ఆమె అందం అభినయం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాయి. యూత్‌లో ఈమె ఫాలోయింగ్ అమాతంగా పెరిగింది. కొందరైతే మృణాళినితో సినిమాలు చేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫిల్మ్ మేకర్స్‌ను ట్యాగ్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్‌లో ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది.

చాలా మంది దర్శక, నిర్మాతలు మృణాళినితో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారట. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికి రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు. దీనికి కారణం రెమ్యూనరేషనేనట. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉందట. అడిగినంత ఇస్తేనే సినిమా చేయాలని తోటి హీరోయిన్‌లకూ క్లాసు తీసుకుంటుందట. సీతారామమ్ మూవీకి 75 లక్షలు తీసుకున్న ఈ భామ నానీతో కలిసి నటించబోయే #నాని30 సినిమాకు ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందట. ఈమెకు ఉన్న క్రేజ్‌కు నిర్మాతలు కూడా రెమ్యూనరేషన్‌ విషయంలో వెనుకాడడంలేదట.

డబ్బు మాత్రమే కాదు, స్టోరీ, క్యారక్టరైజేషన్ విషయంలో కూడా ఈ అమ్మడు ఫుల్ క్లారిటీగా ఆలోచించి అడుగువేస్తుందట. రెండో సినిమా విషయంలో చాలా కధలు విన్నా తను అవేమీ మెచ్చలేదట. చివరికి నాని సినిమాకు సంబంధించిన కథ, క్యారక్టరైజేషన్ నచ్చటంతో ఓకే చెప్పేసిందట. ఈ సినిమాకోసం ఏకంగా ఎన్టీఆర్ సినిమానే కాదనుకుందన్న టాక్‌ టాలీవుడ్‌లో గుప్పుమంటోంది. ఎన్టీఆర్ 30వ సినిమాలో మృణాలిని ఠాకూర్‌నే తీసుకుందామని అనుకున్నా తారక్ సినిమాలో క్యారెక్టర్ కంటే అదే సమయంలో నానీ మూవీకి సంబందించిన క్యారెక్టర్ నచ్చడంతో #నాని30కే ఓకే చెప్పేసిందట.

సీతారామం తరువాత తెలుగులో మృణాళిని నటించబోయే రెండో సినిమా కావడంతో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు కూడా భారీ క్రేజ్ వస్తోంది. మృణాళిని, తారక్‌తో సినిమాను కాదనుకొని నానితో జత కట్టిందంటే, ఈ సినిమా రేంజ్‌ ఎలా ఉంటుందో, ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలయ్యే రిజల్ట్‌ ఏ మేరకు వస్తుందో చూడాలి.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story