కామెడీ షో అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో జబర్థస్త్(Jabardasth) ఒక్కటే. తెలుగులో ఇంత ఆదరణ ఉన్న షో మరొకటి లేదు. బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు ఈమధ్య ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

కామెడీ షో అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో జబర్థస్త్(Jabardasth) ఒక్కటే. తెలుగులో ఇంత ఆదరణ ఉన్న షో మరొకటి లేదు. బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు ఈమధ్య ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గతంలో ఎక్కువ కాలం జడ్జులుగా కొనసాగిన నాగబాబు(Nagababu), రోజాలు(Roja) కాల క్రమంలో వెళ్ళిపోయి.. ఖష్బు, మనో, ఆమని, మీనా లాంటి ఎంతో మంది వచ్చారు. ఇక ప్రస్తుతం కృష్ణ భగవాన్(Krishna Bagawan) తో పాటు సీనియర్ నటి ఇంద్రజ(Indhraja) కూడా జడ్జ్ గ ాకొనసాగుతున్నారు.

అయితే జబర్ద్స్ రెండు ప్రోగ్రామ్స్ కు రష్మి(Rashmi), అనసూయ(Anasuya) యాంకర్లు గా సందడి చేసి.. ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల అనసూయ జబర్థస్త్ ను మానేయడంతో.. కొత్త యాంకర్‌ గా సౌమ్య రావు(Sowmya Rao). వచ్చారు సౌమ్యరావు ఏడాదిన్నరిగా.. యాంకర్ గా సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఆమె స్థానంలో కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్‌ను(Siri Hanumanth) తీసుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఆమెను పరిచయం చేశారు. సిరి హన్మంత్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇటీవలే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన షారుక్ ఖాన్(Shah Rukh Khan) ‘జవాన్’(Jawan) సినిమాలో ఆమె కనిపించింది. ఓ పాత్రలో అలరించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

సిరి హన్మంత్ పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్-5లోనూ మెరిసింది. హౌస్‌లో ఉన్నప్పుడు యూట్యూబర్ షణ్ముఖ్‌తో ఆమె వ్యక్తిగత స్నేహంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ ఎపిసోడ్‌తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపుతోపాటు ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సిరి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్‌ అవకాశాన్ని దక్కించుకుంది. మరి కొత్త వేదికపై ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచిచూడాలి.

అయితే కొన్ని పర్సనల్ కారణాల వల్ల సౌమ్యరావు నెల రోజులు బ్రేక్ తీసుకోవడం వల్ల.. ఆమె స్థానంలో తాత్కాలికంగా సిరీ వచ్చిందని మరో వాదన వినిపిస్తుంది. ఈ విషయం.. ప్రోమోలో నూకరాజు నోరు జారటం వల్ల బయటకు వచ్చింది. మరి ఇందులో నిజం ఎంతో చూడాలి.

Updated On 6 Nov 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story