వ్యూహం(Vyooham) సినిమాపై హైకోర్ట్‌లో(High Court) విచారణ కొనసాగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను సవాలు చేస్తూ సినిమా యూనిట్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందనీ తమ వాదనలను వినిపించారు.
వ్యూహం(Vyooham) సినిమాపై హైకోర్ట్‌లో(High Court) విచారణ కొనసాగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను సవాలు చేస్తూ సినిమా యూనిట్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందనీ తమ వాదనలను వినిపించారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని వివరించిన సినిమా యూనిట్ తరపు న్యాయవాదులు. కాగా ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 11 కు బదులు 8వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది. మెరిట్స్ ఆధారంగా ఈనెల 8 న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్‌కు డివిజన్ బెంచ్(Division Bench) ఆదేశించింది. వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ హై కోర్ట్ డిస్పోస్ చేసింది.