సింగర్ సునీత(Singer Sunitha) కొడుకు ఆకాశ్(Akash) హీరోగా వస్తున్న సినిమా సర్కర్ నౌకరి(Sarkar naukari). దీనికి గంగనమోని శేఖర్(Ganganamoni Shekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(K.Raghavendra Rao) నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.

Singer Sunitha Son Debute Movie
సింగర్ సునీత(Singer Sunitha) కొడుకు ఆకాశ్(Akash) హీరోగా వస్తున్న సినిమా సర్కర్ నౌకరి(Sarkar naukari). దీనికి గంగనమోని శేఖర్(Ganganamoni Shekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(K.Raghavendra Rao) నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.తెలంగాణలోని కొల్లాపూర్‌లో 1996లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్టు టీజర్‌లో చూపించారు. దానికి తగ్గట్లే టీజర్ మొత్తం అప్పటి సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో నిండి ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే ఓ అమ్మాయికి అలాంటి అబ్బాయే దొరుకుతాడు. కానీ ఏ జాబ్ అనేది ఎవ్వరికీ తెలియదు. సర్కార్ నౌకరంటే చాలు డబ్బులు బాగా వస్తాయి అనే ఆలోచించే విధంగా అప్పట్లో జనాలు ఉండేవారని టీజర్‌లో చూపించారు. టీజర్ చివర్లో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా ఆకాష్‌ను చూపించాడు. అయితే దానివల్ల ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కున్నాడు? ఆకాష్ జాబ్ గురించి తెలిసిన హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకుంటుందా? ఒక వేళ పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం ఎలా సాగింది? అనే కథనంతో సినిమాను రూపొందించారు.
