దాదాపు మూడేళ్ల క్రితం బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని(Ram Veerapaneni) రెండో పెళ్లి చేసుకుని సంచలనంగా మారింది సింగర్ సునిత. ఆమె ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఆ టైమ్ లో సునిత పెళ్ళి చేసుకోవడంతో అప్పట్లో సింగర్ సునీత పేరు బాగా వైరల్ అయింది. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా రకరకాలుగా ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే, వీటన్నింటిని ముందుగానే ఊహించిందో..యుద్దానికి ముందు నుంచే సిద్దంగా ఉందో తెలియదు కాని..అలా ట్రోల్ చేసేవారికి మాత్రం ఆమె దీటుగా సమాధానం ఇచ్చారు.

ఆర్టిస్ట్ అన్నాక సున్నితంగానే ఉండాలి అంటున్నారు సింగర్ సునిత(Singer sunitha). తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన ఆమె.. కొన్ని అంశాలు పంచుకున్నారు. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

దాదాపు మూడేళ్ల క్రితం బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని(Ram Veerapaneni) రెండో పెళ్లి చేసుకుని సంచలనంగా మారింది సింగర్ సునిత. ఆమె ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఆ టైమ్ లో సునిత పెళ్ళి చేసుకోవడంతో అప్పట్లో సింగర్ సునీత పేరు బాగా వైరల్ అయింది. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా రకరకాలుగా ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే, వీటన్నింటిని ముందుగానే ఊహించిందో..యుద్దానికి ముందు నుంచే సిద్దంగా ఉందో తెలియదు కాని..అలా ట్రోల్ చేసేవారికి మాత్రం ఆమె దీటుగా సమాధానం ఇచ్చారు.

ఇక హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునిత తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో(Interview) ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి రికార్డింగ్ స్టూడియోలో చర్చించాల్సిన అవసరం లేదని, వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరని చెప్పారు. గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్లినట్టుగానే, స్టూడియోలోకి కూడా వెళ్తానని పేర్కొన్నారు.

నువ్వు రిలేషన్‌లో ఉన్నావా? నీ జీవితంలో ఏం జరిగింది?, నీ దగ్గర డబ్బుందా?’ లాంటి ప్రశ్నలకు అక్కడ తావులేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని వదిలేసి స్టూడియోలో అడుగుపెట్టినప్పుడే సంతోషంగా ఉండగలుగుతామని పేర్కొన్నారు. తాను చాలా మృదుస్వభావినని, ప్రతిదానికీ కన్నీళ్లు పెట్టుకుంటానని తెలిపారు. అలా ఏడవకపోతే తాను అర్టిస్ట్‌ను ఎలా అవుతానని ప్రశ్నించారు. తన నవ్వు చాలా ఫేక్‌గా ఉంటుందని చాలామంది కామెంట్ చేశారని, కానీ తానెప్పుడు అలా నవ్వుతానో తనకు బాగా తెలుసన్నారు. తనకు ప్రకృతే దేవుడని తేల్చి చెప్పారు.

Updated On 18 Nov 2023 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story