నేను అన్ని పార్టీల రాజకీయ నాయకులని గౌరవిస్తాను. నేను  ఆర్టిస్ట్ ని, వినోదం అందించడమే నా పని. నేను జీవితాంతం ఆర్టిస్ట్ గానే ఉంటాను. అన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో నా గురించి ఈ ఫేక్ న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. 

గత కొన్ని రోజులుగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj) పాలిటిక్స్(Politics) లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ పై స్వయంగా రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ప్రతి ఒక్కరికి ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎలాంటి రాజకీయాల్లోకి వెళ్లడం లేదు. గోషామహల్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే గా పోటీ చేయబోతున్నట్లు రూమర్లు వస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలు అన్నీ ఫేక్. ఎలాంటి వాస్తవం లేదు.

నేను అన్ని పార్టీల రాజకీయ నాయకులని గౌరవిస్తాను. నేను ఆర్టిస్ట్ ని, వినోదం అందించడమే నా పని. నేను జీవితాంతం ఆర్టిస్ట్ గానే ఉంటాను. అన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో నా గురించి ఈ ఫేక్ న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయో అర్థం కావడం లేదు.

సంగీతంలోనే నా కెరీర్ కొనసాగిస్తాను. ఇండస్ట్రీలో నేను చేయాల్సి పని చాలా ఉంది. ఏ పార్టీ నుంచి రాజకీయ నాయకులు నన్ను కలవడం కానీ.. నేను వారిని కలవడం కానీ జరగలేదు. ఇలాంటి రూమర్స్ సృష్టించడం ఆపండి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన గురించి వస్తున్న రూమర్స్ పై వివరణ ఇచ్చారు.

Updated On 26 Aug 2023 3:40 AM GMT
Ehatv

Ehatv

Next Story