పాటలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న స్టార్‌ సింగర్‌ మంగ్లీ(Singer Mangli)కి గాయాలయ్యాయి. తెలంగాణ(Telangana)లో ప్రతి ఏడాది ఆషాఢమాసం బోనాల వేడుకల సందర్భంగా ఓ పాటను చిత్రీకరించి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు మంగ్లీ. ఈసారి కూడా బోనాల పాటను గొప్పగా చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశారు మంగ్లీ. అయితే ఆ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె కిందపడ్డారు. దీంతో ఆమె కాలికి స్వల్పంగా గాయమయ్యింది.

పాటలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న స్టార్‌ సింగర్‌ మంగ్లీ(Singer Mangli)కి గాయాలయ్యాయి. తెలంగాణ(Telangana)లో ప్రతి ఏడాది ఆషాఢమాసం బోనాల వేడుకల సందర్భంగా ఓ పాటను చిత్రీకరించి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు మంగ్లీ. ఈసారి కూడా బోనాల పాటను గొప్పగా చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశారు మంగ్లీ. అయితే ఆ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె కిందపడ్డారు. దీంతో ఆమె కాలికి స్వల్పంగా గాయమయ్యింది. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మంగ్లీకి అయిన గాయం చిన్నదేనని, ఆమె త్వరగానే కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. తెలంగాణ పాటలు, బతుకమ్మ పాటలు మంగ్లీని చాలా పాపులర్‌ చేశాయి. ఆ తర్వాత మంగ్లీ సినిమాల్లో పాడటం మొదలు పెట్టారు. ఆమె పాడిన పాటల్లో 99 శాతం సూపర్‌హిట్‌ కావడంతో మంగ్లీ బిజీ సింగర్‌గా మారారు.

Updated On 26 Jun 2023 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story