సోషల్ మీడియా(Social media).. చాలా ప్రమాదకరంగా తయారయ్యింది. దాని వల్ల వల్ల ఎంత ఉపమోగం ఉందో.. అంతే ప్రమాదరకంగా కూడా మారింది. రోజురో జుకు సోషల్ మీడియా మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.
సోషల్ మీడియా(Social media).. చాలా ప్రమాదకరంగా తయారయ్యింది. దాని వల్ల వల్ల ఎంత ఉపమోగం ఉందో.. అంతే ప్రమాదరకంగా కూడా మారింది. రోజురో జుకు సోషల్ మీడియా మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇది ఉపయోగకరంగా ఉన్నా.. అంతే డామేజ్ కూడా చేస్తోంది.
సైబర్ నేరగాళ్ళు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలను(Celebrity) టార్గెట్ చేస్తున్నారు. ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టా(Insta) ఖాతాలను హ్యాక్(Hack) చేయడమే కాకుండా.. ఫేక్ అకౌంట్లను(Fake accounts) సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య వాట్సాప్ లోనూ ఇలాంటి తరహా మోసాలు జరుగుతూ ఉన్నాయి.రీసెంట్ గా రష్మిక(Rashmikha), కత్రీనా(Katrina), ఆలియా(Alia Bhatt) ల డీప్ ఫేక్ ఫోటోలు(Deep Fake Video) చూశాం కదా.. ఇక తన పేరుతో ఓ ఆకతాయి చేస్తున్న మోసాన్ని వెల్లడించడంతో పాటు..అడ్డుకునే ప్రయత్నం చేశారు టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్య.
తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది కౌసల్య(Kousalya).సోషల్ మీడియాలో కొంత మంది తన పేరు, నంబర్ అంటూ ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. అది నా నంబర్ కాదు.. నా అకౌంట్ కాదు. ఎవరో నా ఫొటో డీపీ పెట్టుకుని, చాట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి” అని తన ఫాలోవర్లకు సూచించింది. ఇక ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన ఫాలోవర్లు ఇలాంటి వారితో చాటింగ్ లు కానీ, డబ్బులు పంపడం కానీ చేయెద్దని పేర్కొంది. కాగా.. గతంలోనూ ఓసారి కౌసల్యకు ఇదే సమస్య ఎదురైంది. ఈ విషయంపై వెంటనే స్పందించి.. ఆ మోసాలను బయటి ప్రపంచానికి చెప్పి.. ఫాలోవర్లను అప్రమత్తం చేసింది.