పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకు వెళుతోంది హారిక

టాలీవుడ్‌ సింగర్‌ హారికా నారాయణ్‌ పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా హారిక నారాయణ్.. పృథ్వీనాథ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉంది. కొద్దిరోజుల కిందట ఎంగేజ్మెంట్ జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేసింది. తాజాగా హారిక- పృథ్వీనాథ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకలో పలువురు సింగర్లు, సినిమా ప్రముఖులు భాగమయ్యారు.

పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకు వెళుతోంది హారిక. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారికకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజుల కిందట ఆమె తెలిపింది. ఆమె ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగించినట్లు తెలిపింది. 'ఏడేళ్ల నుంచి మాది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం అంటూ హారిక నారాయణ్' అంటూ పోస్టు పెట్టింది. ఆమెకు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.

Updated On 17 March 2024 8:44 PM GMT
Yagnik

Yagnik

Next Story