ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(chinmayi sripada) టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌పై(Jani master) విమర్శలు గుప్పించారు.

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(chinmayi sripada) టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌పై(Jani master) విమర్శలు గుప్పించారు. సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమంలో ఉన్నప్పట్నుంచే చిన్మయి అనేక అంశాలపై తనదైన శైలిలో రియాక్టవుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పుతున్నారు. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారికి అండగా నిలుస్తూ వస్తున్నారు. డాన్స్‌ మాస్టర్‌ జానీపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి పక్షాన చిన్మయి నిలబడ్డారు. జానీ కథనాలు చూస్తుంటే ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ వేధించడం ప్రారంభించాడని అర్థమవుతోందని చిన్మయి అన్నారు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని జానీ మాస్టర్‌ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే! రచయిత వైరముత్తుపై చిన్మయి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే వైరముత్తు తన ఫోన్‌ నంబర్‌ తీసుకుని పలు ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. తాను నంబర్‌ మార్చినా కూడా ఎదో విధంగా నంబర్‌ తెలుసుకుని కాల్స్‌ చేసేవాడని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణల తర్వాత చిన్మయికి అవకాశాలు తగ్గడం గమనార్హం.

Eha Tv

Eha Tv

Next Story