కె.వి.రెడ్డి(KV Reddy) వంటి మహా దర్శకుల దగ్గర పని చేసిన సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎవర్‌గ్రీన్‌ సినిమా మాయాబజార్‌కు(Mayabazaar) పని చేసిన సింగీతం శ్రీనివాసరావు(Srinivas Rao) అన్ని రకాల జోనర్‌ సినిమాలు తీయగలరు. ఆయన సినిమాలన్నీ జనరంజకాలే! ఇక కమలహాసన్‌తో(Kamal Hassan) కలిసి తీసిన సినిమాల గురించి చెప్పనే అక్కర్లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, విచిత్రసోదరులు, మైకేల్‌ మదనకామరాజు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చినవే! ఇందులో విచిత్ర సోదరుడు అయితే చాలా చాలా ప్రత్యేకం. అందులో కమలహాసన్‌ మరుగుజ్జు పాత్రలో నటించారు.

కె.వి.రెడ్డి(KV Reddy) వంటి మహా దర్శకుల దగ్గర పని చేసిన సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎవర్‌గ్రీన్‌ సినిమా మాయాబజార్‌కు(Mayabazaar) పని చేసిన సింగీతం శ్రీనివాసరావు(Srinivas Rao) అన్ని రకాల జోనర్‌ సినిమాలు తీయగలరు. ఆయన సినిమాలన్నీ జనరంజకాలే! ఇక కమలహాసన్‌తో(Kamal Hassan) కలిసి తీసిన సినిమాల గురించి చెప్పనే అక్కర్లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, విచిత్రసోదరులు, మైకేల్‌ మదనకామరాజు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చినవే! ఇందులో విచిత్ర సోదరుడు అయితే చాలా చాలా ప్రత్యేకం. అందులో కమలహాసన్‌ మరుగుజ్జు పాత్రలో నటించారు. కమలహాసన్‌ను అలా ఎలా చూపించారో ఇప్పటికీ చాలా పెద్ద ప్రశ్న. దీనిపై తలో రకంగా చెప్పుకున్నారే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియదు. దీని గురించి సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao) ఆ మధ్యన వివరించి చెప్పారు. 'అమావాస్య చంద్రుడు సినిమా పూర్తయిన తర్వాత మా కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తే ఎలా ఉంటుందని మేము అనుకున్నాం. ఆ సినిమాను రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తానే స్వయంగా నిర్మిస్తానని కమలహాసన్‌ మాట ఇచ్చాడు. అయితే మొదట అనుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం పొట్టివాడి పాత్ర ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తుంది. కానీ వారిద్దరూ అతడిని ప్రేమించరు.

ఆ సంగతి తెలిసి చివరకు అతడు ఎంతో బాధపడతాడు.. ఇది మేము అనుకున్న కథ. నాలుగైదు రోజులు షూటింగ్‌ కూడా చేశాం. ఇదే విషయానికి ప్రముఖ నిర్మాత, దర్శకులు పంజు అరుణాచలానికి చెబితే కమలహాసన్‌ వంటి వ్యక్తితో ఇలాంటి సినిమా తీస్తే ఫ్లాప్‌ అవుతందని, పగ ప్రతీకారం తరహా కథ అయితే బాగుంటుందని చెబుతూ కొన్ని మార్పులు సూచించారు. ఆయన చెప్పినట్టుగా కథను మార్చి అప్పుడు సెట్స్‌పైకి వెళ్లాము. అయితే మాకు అత్యంత కష్టమైన పని కమల్‌ను పొట్టివాడిగా చూపించడం. ఇప్పుడంటే గ్రాఫిక్స్‌లో చూపించవచ్చు కానీ అప్పట్లో అలాంటివేవీ లేవు' అని సింగీతం చెప్పుకొచ్చారు. 'కమల్‌ మామూలుగా కనిపించేటప్పుడు నిలబడి మాట్లాడతాడు. అలాంటి సన్నివేశాలను కమల్‌ నడుం వరకు లేదా క్లోజప్‌ షాట్లను మాత్రమే తీశాం. ఇక స్క్రీన్‌పై కమల్‌ పొట్టివాడిగా కనిపించేందుకు ఆయన మోకాళ్లు పట్టేలా వెనుకవైపు ఓపెన్‌ ఉండేలా 18 అంగుళాల తేలికపాటి షూను ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తొడిగాము.

నేలపై కనిపించేటప్పుడు కమల్‌ కాళ్లను భూమిలోపల పాతిపెట్టేవాళం. కమల్‌ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలనే విషయాలన్నీ జపాన్‌ అనే సెట్‌ బాయ్‌ చూసుకునేవాడు. కమల్‌ నడిచే సన్నివేశాలలో కెమెరా ట్రిక్‌ను ఉపయోగించి తీశాం. నడక సహజంగా ఉండటానికి కమలహాసన్‌ చాలా శ్రమించారు. సోఫాలో కూర్చున్నప్పుడు, బల్లపై నిలబడినప్పుడు కమల్‌ కాళ్లను వెనక్కి మడిచి పైకి లేపి కట్టేవాళ్లం. మానిటర్‌ కూడా లేని ఆ రోజుల్లో రీటేక్‌లు లేకుండా కమల్‌ పడిన కష్టం మాటల్లో చెప్పలేము. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా అనే పాటలో కమలహాసన్‌ కాళ్లు ఊపే సన్నివేశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా సోఫాను తయారు చేయించి, దాని లోపలికి కమలహాసన్‌ దిగి నడుం వరకూ కనపడేలా కూర్చోబెట్టాం. కమల్‌కు ముందువైపు కృత్రిమ కాళ్లను అమర్చి ఆ కాళ్లకు వైర్‌ను తగిలించి ఊపేవాళ్లం. దీనికి కమల్‌ కష్టంతో పాటు, జపాన్‌ అనే వ్యక్తి సహకారం మర్చిపోలేనిది. అందుకే జపాన్‌ అనే వ్యక్తి లేకపోతే విచిత్ర సోదరులు(vichtra sodharulu) అనే సినిమా లేదు అని సిల్వర్‌ జూబ్లీలో(Silver Jublee) కమల్‌ మెచ్చుకున్నారు' అని అంటూ సింగీతం శ్రీనివాసరావు విచిత్ర సోదరులు సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. నిజమే అందరూ అంత కష్టపడ్డారు కాబట్టే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది.

Updated On 8 Aug 2023 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story