ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. సినిమా తారలే కాదు.. వారి ఇంట్లో వారిని కూడా కోప్పోతున్న వార్తలు తరచూ చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ దర్శకుడు తన తండ్రిని కోల్పోయారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. సినిమా తారలే కాదు.. వారి ఇంట్లో వారిని కూడా కోప్పోతున్న వార్తలు తరచూ చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ దర్శకుడు తన తండ్రిని కోల్పోయారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) తన తండ్రిని కోల్పోయారు.. ఈమధ్య విజయ్ ఆంటోని(Vijay Antony) కూతురు సూసైడ్ చేసుకుంది.. ఆమధ్య నాజర్ కూడా తండ్రి ని కోల్పోయారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ హరికి(Hari) కూడా పితృ వియోగం కలిగింది. స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు హరి. ముఖ్యంగా ఆయన సూర్యతో(Surya) తెరకెక్కించిన సింగం(Singam) సిరీస్ కి మాత్రం సౌత్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది.

ఇప్పటివరకు సింగం సిరీస్ లో మూడు చిత్రాలు వచ్చాయి. సింగం 4 కి కూడా సన్నాహకాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే డైరెక్టర్ హరి ఇంట్లో విషాదకరం సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ హరి తండ్రి మరణించారు. డైరెక్టర్ హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్(VA GopalaKrishna) చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా గోపాలకృష్ణన్ వృధ్దాప్య సమస్యలతో పాటు.. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లు తెలుస్తోంది.

తండ్రిని కోల్పోయిన డైరెక్టర్ హరికి కోలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతల, నటులు సంతాపంప్రకటిస్తున్నారు. హరికి పోన్ ద్వారా కొంత మంది.. నేరుగా వెళ్లి మరికొంత మంది ఓదార్పును ఇస్తున్నారు. ఇదిలా ఉండగా గోపాల కృష్ణన్ కి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ప్రస్తుతం హరి.. విశాల్ హీరోగా ఓ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated On 24 Oct 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story