మహనీయుల జీవితాలను పాఠ్యాంశాలుగా చేసి పిల్లలకు బోధిస్తుంటారు. కాని చిత్రంగా బెంగళూరులో సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేశారు. హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో తమన్నా గురించి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

మహనీయుల జీవితాలను పాఠ్యాంశాలుగా చేసి పిల్లలకు బోధిస్తుంటారు. కాని చిత్రంగా బెంగళూరు(Bangalore)లో సినీ నటి తమన్నా(Actress Tamannah) జీవితాన్ని పాఠ్యాంశంగా చేశారు. హెబ్బాళ(Hebbal)లోని సింధీ ఉన్నత పాఠశాల(Sindhi High School)లో తమన్నా గురించి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆ స్కూలుపై బాలల హక్కుల రక్షణ సంఘానికి కంప్లయింట్ కూడా చేశారు. ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలలో ఏడో చాప్టర్‌లో సింధీ వ్యక్తుల గురించి ఓ పాఠం ఉంది. ఇందులో తమన్నా భాటియా, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ జీవితాలపై పాఠం ఉంది. తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారని, పెద్ద పెద్ద కళాకారులున్నారని వారి జీవితగాధలను పాఠ్యాంశంగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేరంట్స్‌ అంటున్నారు. తాము ఇలా చేస్తున్నందుకు తమ పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తామంటూ స్కూల్‌ యాజమాన్యం బెదిరిస్తున్నదని తల్లిదండ్రులు అన్నారు. మరోవైపు తల్లిదండ్రులను స్కూల్‌ యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను పొందుపరిచినట్టు చెప్పింది. దేశ విభజన జరిగినప్పుడు సింధూ ప్రాంతం కొంత పాకిస్తాన్‌లో, మరికొంత ఇండియాలో ఉండింది. ఆ తర్వాత సింధు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం పిల్లలకు తెలియచేయడానికే పాఠ్యాంశంగా ముద్రించినట్టు స్కూల్ యాజమాన్యం అంటోంది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా ఎన్నో విజయాలను సాధించారని, అందుకే ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చామని చెప్పుకొచ్చింది.

Eha Tv

Eha Tv

Next Story