రస్నా (Rasna)బేబీగా అందరిని అలరించిన అంకిత ఆ తర్వాత హీరోయిన్ అయ్యారు. లాహిరి లాహిరి లాహిరి(Lahiri Lahiri Lahiri) సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా సింహాద్రిలో(Simhadri) హీరోయిన్‌గా నటించిన అంకింతకు వరుస ఆఫర్లు వచ్చాయి. ధనలక్ష్మి ఐ లవ్‌యూ, ప్రేమలో పావని కల్యాణ్‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

రస్నా (Rasna)బేబీగా అందరిని అలరించిన అంకిత(Ankitha) ఆ తర్వాత హీరోయిన్ అయ్యారు. లాహిరి లాహిరి లాహిరి(Lahiri Lahiri Lahiri) సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా సింహాద్రిలో(Simhadri) హీరోయిన్‌గా నటించిన అంకింతకు వరుస ఆఫర్లు వచ్చాయి. ధనలక్ష్మి ఐ లవ్‌యూ, ప్రేమలో పావని కల్యాణ్‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నవదీప్‌తో(Navdeep) మనసు మాట వినదు, గోపీచంద్‌తో(Gopichandh) రారాజు, రవితేజతో(Raviteja) ఖతర్నాక్‌ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ సినిమా విజయేంద్ర వర్మ(Vijayendra Varma) సినిమా ఆమెకు కలిసి రాలేదు. 2009లో చిత్రపరిశ్రమకు ఆమె గుడ్‌బై చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో వివరించారు. 'విజయేంద్రవర్మ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.

కానీ నేను ఆశించిన ఫలితం రాలేదు. ఆ సినిమా విజయవంతం అయ్యి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని' అని అంకిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకొచ్చారు. హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. నవదీప్‌ సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా ఒకేసారి చేయడంతో కాసింత ఒత్తిడికి లోనయ్యానని, ఆ క్రమంలో అసహనానికి గురయ్యాను తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తి అగర్వాల్‌(Arthi Aggarwal), ఉదయ్‌ కిరణ్‌(Uday Kiran) తనకు మంచి స్నేహితులని, ఇప్పుడు వారిద్దరూ లేకపోవడం బాధాకరమని అంకిత అన్నారు. గత ఏడాది హీరో అల్లు అర్జున్‌ను కలిశానని, ఎన్టీఆర్‌తో సోషల్‌ మీడియా వేదికగా టచ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో పాటు పవన్‌ కల్యాణ్‌ కూడా ఇష్టమని, మంచి అవకాశం వస్తే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి రెడీగా ఉన్నానని అంకిత తెలిపారు. ముంబాయికి చెందిన అంకిత 2016లో వ్యాపారవేత్త విశాల్‌ జగపతిని(Vishal Jagapathi) పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత దంపతులు న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.

Updated On 14 July 2023 5:30 AM GMT
Ehatv

Ehatv

Next Story