✕
సిల్క్ స్మిత(Silk Smitha)..ఈ తరం వారికి ఆమె అందం, అభినయం గురించి అంతగా తెలియకపోవచ్చు. కాకపోతే ఓ తరం ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించారు. అగ్రశ్రేణి హీరోల సినిమాలైనా సరే సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే. మత్తెక్కించే ఆమె కళ్లు, మైమరిపించే ఆమె అందం చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! తెలుగులో ఎంతో మంది నటీమణులు వచ్చి వెళ్లారు.

x
silk
-
- సిల్క్ స్మిత(Silk Smitha)..ఈ తరం వారికి ఆమె అందం, అభినయం గురించి అంతగా తెలియకపోవచ్చు. కాకపోతే ఓ తరం ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించారు. అగ్రశ్రేణి హీరోల సినిమాలైనా సరే సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే. మత్తెక్కించే ఆమె కళ్లు, మైమరిపించే ఆమె అందం చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! తెలుగులో ఎంతో మంది నటీమణులు వచ్చి వెళ్లారు. కానీ సిల్క్ స్మిత గురించి మాట్లాడుకున్నట్టు మరెవ్వరి గురించి చర్చించుకోలేదు. అదే ఆమె ప్రత్యేకత! ఆదె ఆమె విశిష్టత.
-
- వెండితెర(Silver screen) శృంగార తారగా మిగిలిపోయారే కానీ ఆమెలో అద్భుతమైన నటి ఉన్నారు. ఆమె ప్రతిభాపాటవాలను దర్శకులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారన్నది అక్షరసత్యం. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కెరీర్‌ను కూడా చాలా కింద నుంచి ప్రారంభించారు. కానీ తన నటన, అందంతో తన కీర్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు.
-
- ఆమె గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే అందుకు కారణమదే! 1960 డిసెంబర్ 2వ తేదీన జన్మించిన స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి(vadlapati Vijayalakshmi). బాల్యమంతా కష్టాలతో గడించింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేశారు. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వివాహ జీవితం కూడా కన్నీళ్లతో, వేదనతో గడిచింది.
-
- అక్కడ కూడా సుఖం లేకుండా పోయింది. ఇక భరించలేక అత్తింటి వదిలిపెట్టి చెన్నై నగరానికి బతుకు తెరువు కోసం వచ్చారు. సినిమాల(Movies)పై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట్లో నటీమణులకు మేకప్(Makeup) వేసేవారు. తర్వాత ఆమెకు నటి కావాలనే కోరిక మొదలయ్యింది. 1979లో వచ్చిన పండిచక్రమ్(Pandichakram) అనే తమిళ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో విజయలక్ష్మి క్యారెక్టర్ పేరు సిల్క్.
-
- ఆ పాత్ర బాగా పాపులర్ కావడంఓ ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు. తన 17 ఏళ్ల సినీ కెరీర్లో 450కి పైగా సినిమాలలో నటించారు. సిల్క్ స్మిత కోసమే ప్రత్యేకంగా పాటలు రూపొందించిన సందర్భాలు అనేకం. ఆమె పాట కోసమే సినిమాలకు వచ్చేవారు ప్రేక్షకులు కోకొల్లలగా ఉండేవారు. ఆమె ఇండియన్ మార్లిన్ మన్రోగా(Marlin Marno) పేరు సంపాదించుకున్నారు. ఒకానొక టైమ్‌లో హీరోయిన్ల కంటే సిల్క్కే క్రేజ్ ఎక్కువగా ఉండింది.
-
- హీరోయిన్లకు మించిన పారితోషికం తీసుకున్నారు. తొమ్మిదవ దశకం వచ్చేసరికి సిల్క్ స్మిత ప్రాభవం తగ్గడం మొదలయ్యింది. వెలుగు జిలుగుల ఇండస్ట్రీ ఆమె జీవితాన్ని చీకటిమయం చేసింది. ఇదే సమయంలో ఆమె నిర్మాణరంగంలో అడుగుపెట్టి దారుణంగా నష్టపోయారు. ఆమె ప్రేమ కూడా విఫలమయ్యింది.
-
- ఓ వైపు అప్పులు, మరోవైపు విఫలప్రేమ మిగిల్చిన మానసిక క్షోభ ఆమెను కుంగదీశాయి. ఆమె డిప్రెషన్లోకి(Depression) వెళ్లిపోయారు. అందులోంచి బయటపడలేకపోయారు. 1996, సెప్టెంబర్ 23న చెనైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని(Suicide) చనిపోయారు. ఆమె మరణం(Death) ఎన్నో అనుమానాలను మిగిల్చింది.
-
- ఓ అగ్రకథానాయకుడు ప్రేమ పేరుతో మోసం చేయడం తట్టుకోలేకే స్మిత చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుంటారు. ఇప్పటికీ స్మిత ఆత్మహత్య వెనుకగల కారణాలపై స్పష్టత లేదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్లో వచ్చిన డర్జీ పిక్చర్ అనే సినిమాలో కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

Ehatv
Next Story