సిల్క్‌ స్మిత పుట్టిన రోజు సందర్భంగా సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌(Queen Of South) అనే సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.



సిల్క్‌ స్మిత పుట్టిన రోజు సందర్భంగా సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌(Queen Of South) అనే సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.


సిల్క్‌ స్మితగా చంద్రికా రవి(Chandrika Ravi) ఒదిగిపోయింది. 35 ఏళ్ల ఈ ముద్దు గుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.




ఎవరీ చంద్రికా రవి అంటూ వెతుకులాట మొదలయ్యింది. వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ బాలకృష్ణతో ఆడిపాడిన అమ్మాయి చంద్రికా రవినే!





ఆస్ట్రేలియా పుట్టి పెరిగింది చంద్రికా రవి. అయినప్పటికీ భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె మాటలో, పాటలో, నటనలో, డాన్సులో భారతీయత కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో పుట్టిన చంద్రికా రవికి మూడేళ్ల వయసులోనే డాన్స్‌ యాక్టింగ్‌లలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు మల్లిక, రవి శ్రీధరన్‌లు. చిన్న వయసులోనే సింగపూర్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలను అందుకుంది.





కొత్త కొత్త ప్లేసులకు వెళ్లడం చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్‌లోనే ఎన్నో దేశాలకు వెళ్లి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్‌లో కెరీర్‌ మొదలు పెట్టింది. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ వంటి నృత్య రీతులను అభ్యసించింది. అంతేనా యూఎస్‌ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది.





అమెరికన్‌ టాక్‌ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.సెయి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.




ఇందులో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో చక్కటి నటనను కనబర్చింది. అడల్ట్‌ కామెడీ హారర్‌ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడులో నటించింది. ఇందులో దెయ్యం పాత్రలో ఆమె కనిపించింది. విదేశాల్లో కొన్ని ఫీచర్‌ ఫిల్మ్‌లు చేసింది.




వైవిధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ప్రాధాన్యతను ఇచ్చే చంద్రికా రవి పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. సిల్క్‌ స్మిత బయోపిక్‌లో అచ్చం స్మితలాగే ఉందని అనిపించుకుంది.





Updated On 2 Dec 2024 11:44 AM GMT
ehatv

ehatv

Next Story