సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA FILM Awards 2023) వేడుక దుబాయ్‌లో(Dubai) మొదలయ్యింది. సినీ రంగానికి చెందిన వారు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులను దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ఈ అవార్డు గత పదేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. సైమాగా ప్రసిద్ధి చెందిన ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ ఏడాదిలో అడుగుపెట్టింది.

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA FILM Awards 2023) వేడుక దుబాయ్‌లో(Dubai) మొదలయ్యింది. సినీ రంగానికి చెందిన వారు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులను దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ఈ అవార్డు గత పదేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. సైమాగా ప్రసిద్ధి చెందిన ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ ఏడాదిలో అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ స్టార్స్‌ హీరో రానా(Rana), మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ప్రధాన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 15న మొదటి రోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. ఇవాళ అంటే సెప్టెంబర్‌ 16న తమిళ, మలయాళం పరిశ్రమలకు చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాకు బోల్డన్ని అవార్డులు వచ్చాయి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆస్కార్‌తో పాటు ఎన్నో అవార్డులను గెల్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సైమా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఏకంగా 11 నామినేషన్లలో చోటు సంపాదించుకుని అయిదు కీలకమైన అవార్డులను గెల్చుకుంది. సీతారామం(Sitharamam) సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రంగా సీతారామం నిలిచింది. ఉత్తమ నటుడు అవార్డు జూనియర్ ఎన్టీఆర్‌కు(Jr.NTR) లభించగా, ఉత్తమ దర్శకుడి అవార్డు రాజమౌళి(Rajamouli) దక్కించుకున్నాడు. ధమాకా హీరోయిన్‌ శ్రీలీలకు(Sreeleela) ఉత్తమ నటి అవార్డు రాగా, సీతారామంలో నటనకుగాను మృణాల్‌ ఠాకూర్‌కు(Mrunal Thakur) ఉత్తమనటి క్రిటిక్స్‌ అవార్డు దక్కింది. అలాగే మేజర్‌లో నటనకు గాను అడివి శేష్‌కు(Adavi sheh) ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ నిలిచారు.

‘సైమా’ 2023 అవార్డుల విజేతలు

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

Updated On 16 Sep 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story