సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 వేడుకలకు ఇండియన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెడీ అయ్యింది. వచ్చే నెల అనగా ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో సైమా అవార్డ్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.
సైమా - 2023(Sima 2023) వేడుకలకు అందా సిద్దం అవుతోంది. వచ్చే నెలలో జరగబోయే వేడుకలకు ఇప్పటి నుంచే సన్నాహాలు స్టార్ట్ చేశారు మేకర్స్. సూపర్ ఫాస్ట్ గా ఏర్పాట్లుజరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 వేడుకలకు ఇండియన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెడీ అయ్యింది. వచ్చే నెల అనగా ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో సైమా అవార్డ్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే నామినేషన్ల(Nominations) ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఇక తెలుగు నుంచి అందరూ ఊహించిన విధంగా అత్యధిక కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్(RRR) సినిమా నామినేట్ అయ్యింది. ఈమూవీ ఏకంగా 11 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. 10కేటగిరీల్లో నామినేట్ అయ్యి..
మూవీ 'ఆర్ఆర్ఆర్ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. తర్వాత 10 కేటగిరిల్లో నామినేట్ అయ్యి సీతారామం(Sita Ramam) సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది.. ఇక ఈ వేడుకలను ఈ ఏడాది దుబాయ్(Dubai) లోని డి. డబ్ల్యూ. టి. సిలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్తమ చిత్రం' కేటగిరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించి..రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో పాటు సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు'(DJ Tillu), నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ 'కార్తికేయ?'(Karthikeya), అడవి శేష్ మేజర్లతో(Major) పాటు డీసెంట్ బ్లాక్బస్టర్ 'సీతారామం' పోటీ పడుతున్నాయి.
ఇక తమిళంలో అత్యధికంగా నామినేట్ అయిన సినిమాగా పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan 1) ఘనత సాధించింది. ఈసినిమాకు 10 నామినేషన్స్ చిత్రానికి దక్కాయి.మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక పొన్నియన్ సెల్వన్ తరువాతన కమలహాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమ్' సినిమా 9 నామినేషన్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఇవే కాదు అటు కన్నడ నుంచి కెజియఫ్, తో పాటు కాంతారా సినిమాలు కూడా 11 కేటగిరీల్లో నామినేట్ అయ్యి.. సందడిగా ఉంది. ఈసారి అన్ని భాషల నుంచి పోటీ గట్టిగానే ఉంది. ప్రతీ భాషలో భారీ సినిమాలు.. ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాలు వచ్చాయి.అటు మలయాళంలో కూడా ఈసారి సైమా కోసం గట్టిగానే సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈసారి ఆరు సినిమాలు బెస్ట్ మూవీ కేటగిరీలో పోటీపడబోతున్నాయి. మమ్ముట్టి నటించిన 'భీష్మ పర్వం' ఎక్కువగా 8 విభాగాల్లో నామినేట్ అయ్యారు.