హీరో సిద్ధార్థ్‌(Siddharth) మరోసారి పెళ్లి పీటలెక్కాడు. దక్షిణాది హీరోయిన్ అదితి రావు హైదరిని(Aditi Rao Hyder) పెళ్లి చేసుకున్నాడు. వనపర్తి(Wanaparthy) జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో(Srirangapuram temple) పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చి 27వ తేదీన వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు.

హీరో సిద్ధార్థ్‌(Siddharth) మరోసారి పెళ్లి పీటలెక్కాడు. దక్షిణాది హీరోయిన్ అదితి రావు హైదరిని(Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నాడు. వనపర్తి(Wanaparthy) జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో(Srirangapuram temple) పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చి 27వ తేదీన వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్‌- అదితి పెళ్లి జరిగింది. మూడేళ్ల కిందట అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడే వీరు ప్రేమలో పడ్డారట! అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్‌కు, ఈవెంట్స్‌కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్‌ నిశ్చితార్థానికి, పెళ్లికి కూడా అదితి, సిద్ధార్థ్‌ కలిసే వచ్చారు. రీసెంట్‌గా ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్‌ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్ధార్థ్‌ను అడిగితే ఆయన చాలా తెలివిగా అదితిదేవో భవ అంటూ జవాబిచ్చాడు. కానీ ఇప్పటి వరకు తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పలేదు. చాలా రహస్యంగా ఉంచాడు. ఇప్పుడు రహస్యంగానే పెళ్లి చేసుకున్నాడు. అదితిరావు హైదరి మన తెలుగమ్మాయే! అయితే ఆమె కెరీర్‌ మొదలయ్యింది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహా సముద్రం వంటి సినిమాల్లో నటించింది. ఇది ఈమెకు రెండో పెళ్లి. ఇంతకు ముందు సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకున్న అదితి 2012లో అతడికి విడాకులు ఇచ్చింది. సిద్ధార్థ్‌ కూడా ఇంతకు ముందు తన చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్‌ మేఘనను పెళ్లి చేసుకున్నాడు. వీరి దాంపత్య ఎక్కువ కాలం కొనసాగలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.
బాయ్స్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సిద్ధార్థ్‌. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు సినిమాతో అతడికి ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. తర్వాత ఆట, ఓయ్‌, ఓ మై ఫ్రెండ్‌.. ఇలా చాలా సినిమాలు చేశాడు సిద్ధార్థ్‌.

Updated On 27 March 2024 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story