గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ ఐటమ్ అవుతున్నారు హీరో సిద్దార్థ్.. హీరోయిన్ అదితీరావు హైదరీ. తమ రిలేషన్ పట్ట క్లారిటీ ఇవ్వడంలేదు కాని.. చెట్టా పట్టాలు వేసుకుని మాత్రం తెగ తిరిగేస్తున్నారు. ఈక్రమంలో మరోసారి వీరు ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ ఐటమ్ అవుతున్నారు హీరో సిద్దార్థ్.. హీరోయిన్ అదితీరావు హైదరీ. తమ రిలేషన్ పట్ట క్లారిటీ ఇవ్వడంలేదు కాని.. చెట్టా పట్టాలు వేసుకుని మాత్రం తెగ తిరిగేస్తున్నారు. ఈక్రమంలో మరోసారి వీరు ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయారు.

తమిళ హీరో సిద్ధార్థ్‌... హీరోయిన్‌ అదితీ రావు హైదరీలు చెట్టా పట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరు స్పందించలేదు. ఏమాత్రం ఖండించలేదు. ట్రోల్స్ ను కామ్ గా భరిస్తూ వస్తన్నారు. ఇక వీరి విషయం తెలిసి సోషల్ మీడియా కన్ను వీరిమీద పడటంతో.. ఇద్దరు ఎక్కడికి వెళ్లినా దొరికిపోతున్నారు. ఎప్పుడు ఇద్దరు కలిసి ఒక చోట జంటగా దర్శనమిస్తూనే ఉన్నారు.

అయితే ఈక్రమంలోనే తాజాగా.. వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో జంటగా దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. మీడియాను చూసి కాస్త కంగారు పడ్డారు స్టార్ కపుల్.. అందులోను సిద్ధార్థ్‌ మాస్క్‌ వేసుకుని ఉన్నాడు. లగేజీ ట్రాలీని తోసుకుంటూ ఆయన చెకింగ్‌ దగ్గరకు వస్తూ ఉన్నారు.

అయితే ఫోటో గ్రాఫర్లను చూసి ఆయన కాస్త స్పీడ్ పెంచి.. ఎవరిని పట్టించుకోకుండా చెకింగ్ పాయింట్ కు వెళ్ళిపోయాడు. ఇక ఆయన వెనకాల వచ్చిన అదితీ మాత్రం మీడియాకు అడ్డంగా దొరికిపోయింది. ఫోటోలకు ఫోజులు ఇవ్వక తప్పలేదు ఆమెకు. ఇద్దరు స్టార్లు కనిపించగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు.

సిద్దార్థ్ పట్టించుకోకపోయినా.. అదితీ మాత్రం ఫొటోగ్రాఫర్ల దగ్గరకు రాగానే ఆగిపోయారు. నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆతరువాత చెకింగ్‌ దగ్గరకు వెళ్లిపోయారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈవీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీడియాను చూస్తే సిద్ధార్థ్‌కు ఎందుకంత భయం అంటున్నారు. సిద్ధార్థ్‌కంటే హీరోయిన్ అదితీనే ధైర్యవంతురాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరు టాలీవుడ్ లో కలిసి నటించిన మహాసముద్రం టైమ్ లోనే ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.

Updated On 2 Jun 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story