నటి శ్రుతిహాసన్(Shruthi Hassan) కెరీర్‌ బ్రహ్మాండంగా సాగుతోంది. సంక్రాంతి పండుగకు విడుదలైన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veersimha reddy) చిత్రాలతో బారీ విజయాలను ఆమె సొంతం చేసుకున్నారు. ఒక సినిమాలో చిరంజీవి(chiranjeevi) హీరో అయితే, మరో సినిమాలో బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడవ్వడం విశేషం. సోషల్‌ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌. ఎప్పుడూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటారు. లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో(Twitter) అభిమానులతో అభిప్రాయాలను పంచుకున్నారు.

నటి శ్రుతిహాసన్(Shruthi Hassan) కెరీర్‌ బ్రహ్మాండంగా సాగుతోంది. సంక్రాంతి పండుగకు విడుదలైన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veersimha reddy) చిత్రాలతో బారీ విజయాలను ఆమె సొంతం చేసుకున్నారు. ఒక సినిమాలో చిరంజీవి(chiranjeevi) హీరో అయితే, మరో సినిమాలో బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడవ్వడం విశేషం. సోషల్‌ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌. ఎప్పుడూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటారు. లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో(Twitter) అభిమానులతో అభిప్రాయాలను పంచుకున్నారు. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. మంచు ప్రదేశాలలో హీరోయిన్లు చీరలు కట్టుకుని డాన్స్‌లు చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుందని కొద్ది రోజుల కిందట ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్‌ తెలిపరు. ఇదే విషయం గురించి ఓ అభిమాని ప్రశ్న వేశాడు. 'మైనస్‌ ఉష్ణోగ్రతల్లో చీర కట్టుకుని డాన్స్‌ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని పాటలకు చీరలే బాగా సూటవుతాయి. అలాంటప్పుడు ఆ కష్టాన్ని భరించాల్సిందే. ప్రేక్షకులు కూడా ఆ రకమైన పాటలను చూడటానికి ఎంతో ఇష్టపడుతుంటారు. వారి కోసమైనా బాధను భరించాల్సిందే' అని శ్రుతి హాసన్‌ జవాబిచ్చారు.

Updated On 20 Jun 2023 11:51 PM GMT
Ehatv

Ehatv

Next Story