సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు అగ్ర కథానాయిక శ్రుతిహాసన్(shruthi hassan). ఫ్యాన్స్‌తో తరచూ ఇంటరాక్ట్ అవుతారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిస్తారు. వారి సలహాలు స్వీకరిస్తారు. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. లేటెస్ట్‌గా శ్రుతి హాసన్ తన లవర్ శంతను హజారికాతో(Shantanu Hazarika) కలిసి సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు అగ్ర కథానాయిక శ్రుతిహాసన్(shruthi hassan). ఫ్యాన్స్‌తో తరచూ ఇంటరాక్ట్ అవుతారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిస్తారు. వారి సలహాలు స్వీకరిస్తారు. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. లేటెస్ట్‌గా శ్రుతి హాసన్ తన లవర్ శంతను హజారికాతో(Shantanu Hazarika) కలిసి సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు. శంతను హజారికాలో మీకు బాగా నచ్చిన అంశాలేమిటి అని అడిగిన ప్రశ్నకు అతడు అద్భుతమైన ప్రతిభావంతుడు అని మూడు ముక్కల్లో తేల్చేశారు శ్రుతిహాసన్. కొనసాగింపుగా ఇంకా చాలా చెప్పారు. 'శంతనుకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. నేను బాధలో ఉన్న ప్రతీ సందర్భంలో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. తన కళ్ల ద్వారానే ప్రేమను ప్రకటిస్తాడు’ అంటూ ప్రియుడిని తెగ పొగిడేసింది. ఏదైనా చిన్న గొడవలు జరిగితే ముందు ఎవరు సారీ చెబుతారని మరో ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ‘ఆ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ కాను. ముందుగా అతనే సారీ చెప్పాలి’ అని శ్రుతిహాసన్ తెలిపారు. ఈ ఏడాది శ్రుతి హాసన్ తెలుగులో చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహా రెడ్డి సినిమాలలో నటించారు. ఈ రెండు చిత్రాలతో మంచి విజయాలను సాధించాయి.