వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ‘నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవి అవుతా’ అనే సాంగ్ ఎక్కువ వ్యూస్ ను సంపాదించింది. అయితే ఆ సాంగ్ అంతా మంచులోనే షూట్ చేసినట్టు మనకు కనిపిస్తుంటుంది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మంచి.. మంచి విజువల్స్ ఉన్నాయి.. నేను ఆపుకోలేక అవి నా సెల్ ఫోన్ బంధిస్తున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో ఆయన విడుదల చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ వీడియో బాగా ట్రోల్ కూడా అయింది అది వేరే విషయం అనుకోండి.

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ‘నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవి అవుతా’ అనే సాంగ్ ఎక్కువ వ్యూస్‏ను సంపాదించింది. అయితే ఆ సాంగ్ అంతా మంచులోనే షూట్ చేసినట్టు మనకు కనిపిస్తుంటుంది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మంచి.. మంచి విజువల్స్ ఉన్నాయి.. నేను ఆపుకోలేక అవి నా సెల్ ఫోన్ బంధిస్తున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో ఆయన విడుదల చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ వీడియో బాగా ట్రోల్ కూడా అయింది అది వేరే విషయం అనుకోండి.

శృతి హాసన్ (Shruti Haasan) కేవలం చీర, బ్లౌజ్ ధరించి ఆపాటకు మంచులో డాన్స్ చేసింది. అయితే ఆ సినిమా దర్శకనిర్మాతలకు ఆమె ఓ రిక్వెస్ట్ పెట్టింది. మంచులో డ్యాన్స్ చేయడం తనకు చాలా ఛాలెంజింగ్‏గా అనిపిస్తోందని.. వాటిని మానుకోవాలని కోరింది ఈ భామ. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఆమె.. మంచు (snow)లో డ్యాన్స్ చేయడం తనకు ఎందుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మంచులో డ్యాన్స్ చేయడం కష్టమని.. హీరోలు కోటు, శాలువాలు, జాకెట్స్ ధరించి డ్యాన్స్ చేస్తారని.. మాకు మంచులో బ్లౌజ్, చీర కట్టుకోవడమే ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఆ సాంగ్‏లో మంచుకొండల్లో సాంగ్ జరుగుతున్న సమయంలో శృతి వైట్ అండ్ బ్లూ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కనిపిస్తుండగా.. చిరంజీవి టీషర్ట్, డెవిమ్స్, బ్లేజర్, షూస్‏లో కనిపిస్తున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ (prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ (Salaar) సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తయిందని శృతి ఇటీవల తన ఇన్‏స్టా‏గ్రామ్ ద్వారా తెలిపింది. ఆద్యా లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రశాంత్ నీల్‏కు ధన్యవాదాలు తెలిపింది.. ఇటు కో స్టార్ ప్రభాస్‏కు కూడా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. హోంబాలే ఫిల్మ్స్ (hombale films)‏లో చేయడం చాలా సంతోషంగా ఉందని.. షూటింగ్ అంతా కూడా చక్కగా జరిగిందని.. అందరూ ఫ్యామిలీలా కలిసి వర్క్ చేసుకున్నామనితెలిపింది.

అయితే ప్రభాస్ (Prabhas) సరసన శృతిహాసన్ (Shruti Haasan) నటించడం ఇదే మొదటిసారి. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సలార్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ (K.G.F) తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‏లో రూపొందుతున్న చిత్రం సలార్.

Updated On 10 April 2023 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story